News April 11, 2025
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి: ASF కలెక్టర్

ప్రభుత్వ ఆసుపత్రులు,ఆరోగ్య కేంద్రాలకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ASF జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. గురువారం ఆసిఫాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో DMHO సీతారాంతో కలిసి సమీక్ష నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు,ఆయుష్ వైద్యులతో కలసి ఆరోగ్య సేవలపై ఆరా తీశారు.
Similar News
News March 5, 2026
HNK: గుర్తు తెలియని మృతదేహం లభ్యం

జిల్లాలోని ఐనవోలు మండలం సింగారం గ్రామ శివారులోని ఊర చెరువు సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బుధవారం కుక్కలు మృతదేహాన్ని పీక్కుతింటుండగా గ్రామస్థులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి తల, చేతులు లేకపోవడంతో గుర్తు పట్టలేని స్థితిలో ఉంది. పురుషుడి మృతదేహంగా ప్రాథమికంగా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News March 5, 2026
వికారాబాద్‌లో పెరిగిన క్రయవిక్రయాలు!

వికారాబాద్ జిల్లాలో భూములు ఫ్లాట్లు ఇతరత్రా క్రయవిక్రయాలు జోరందుకున్నాయి. దీంతో ప్రభుత్వానికి ఆదాయం చేకూరుతుంది. గతేడాది ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి నాటికి జిల్లాలో రూ.54.56 కోట్ల ఆదాయం సమకూరినట్లు అధికారులు చెబుతున్నారు. ఇందులో అత్యధికంగా వికారాబాద్‌లో రూ.27.59 కోట్ల ఆదాయం సమకూరగా అత్యల్పంగా కొడంగల్లో రూ.6.05 కోట్ల ఆదాయం సమకూరింది.
News March 5, 2026
కర్నూలు: 395 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు

పత్తికొండ శ్రీ వైష్ణవి డిగ్రీ కళాశాలలో శుక్రవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి ఆనంద్ రాజ్ కుమార్, ప్రిన్సిపల్ రాజశేఖర్ తెలిపారు. ఈ జాబ్ మేళాలో వివిధ కంపెనీలలో 395 ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామన్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, ఫార్మసీ చదివిన వారు అర్హులని పేర్కొన్నారు. వయసు 18-40 ఏళ్ల మధ్య ఉండాలన్నారు. ఉదయం 10 గంటల నుంచి ఇంటర్వ్యూలు ప్రారంభమవుతాయని తెలిపారు.


