News April 11, 2025

ఎంపీ కావ్యకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

image

వరంగల్ ఎంపీ కడియం కావ్య పుట్టినరోజు సందర్భంగా ప్రధాని మోదీ ఆమెకు గురువారం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ‘డా. కడియం కావ్య.. మీకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలతో, సంతృప్తికరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాను. మీ జీవితం ఆనందం, శాంతి, శ్రేయస్సుతో నిండి ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ లేఖ రాశారు.

Similar News

News October 25, 2025

HYD: ఉస్మానియా ఆసుపత్రిలో టెలీ కమ్యూనికేషన్ సేవలు..!

image

ఉస్మానియా ఆసుపత్రి వేదికగా టెలీ కమ్యూనికేషన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. నిత్యం 80 నుంచి 100 మంది వరకు ఇది వినియోగించుకుంటున్నట్లుగా అధికారులు తెలియజేశారు. అర్బన్ ఆరోగ్య కేంద్రాల్లో కేవలం ప్రాథమిక వైద్య సేవల మినహా, ఏవైనా స్పెషాలిటీ అవసరమైతే, టెలీ సేవలను అందిస్తున్నారు. మధుమేహ, అధిక రక్తపోటు, కీళ్ల నొప్పులు తదితర సేవలు అందిస్తున్నారు.

News October 25, 2025

జగిత్యాల: రౌడీషీటర్ల కదలికలపై ప్రత్యేక దృష్టి: ఎస్పీ

image

జగిత్యాల జిల్లాలో రౌడీషీటర్ల కదలికలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడకుండా నిఘా పెంచారు. ప్రజలను ఇబ్బంది పెట్టే, తీరుమార్చుకోని వారిపై పీడీ యాక్ట్ అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీషీటర్లపై సమాచారం సేకరించి, అవసరమైతే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

News October 25, 2025

ఆస్ట్రేలియా ఆలౌట్.. భారత్ టార్గెట్ ఎంతంటే?

image

భారత్‌తో జరుగుతున్న మూడో వన్డేలో AUS 236 రన్స్‌కు ఆలౌట్ అయింది. 124-2తో పటిష్ఠ స్థితిలో ఉన్న కంగారూలు భారత బౌలర్ల ధాటికి కుప్పకూలారు. మార్ష్ 41, హెడ్ 29, షార్ట్ 30, రెన్షా 56, క్యారీ 24, కూపర్ 23 రన్స్ చేశారు. మన బౌలర్లలో రాణా 4, సుందర్ 2, సిరాజ్, అక్షర్, ప్రసిద్ధ్, కుల్దీప్ తలో వికెట్ పడగొట్టారు. కాసేపట్లో 237 టార్గెట్‌తో భారత్ బరిలోకి దిగనుంది. IND వైట్‌వాష్ నుంచి తప్పించుకుంటుందా? COMMENT