News April 11, 2025

గోరంట్ల మాధవ్‌పై మరో కేసు

image

ఐటీడీపీ కార్యకర్త కిరణ్‌పై దాడికి య‌త్నించిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై గుంటూరు నగరంపాలెం పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న ఆయనను నేడు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. మరోవైపు మంత్రి లోకేశ్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన మాధవ్‌పై తాడేపల్లి పీఎస్‌లో మరో కేసు నమోదైంది. నిన్న ప్రెస్ మీట్‌లో లోకేశ్ గురించి అసభ్యకర వ్యాఖ్యలు చేశారని TDP నేతలు ఫిర్యాదు చేశారు.

Similar News

News November 4, 2025

పోలీస్ పీజీఆర్‌ఎస్‌కు 105 పిటిషన్లు: ఎస్పీ

image

అనంతపురం ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 105 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ జగదీష్ తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన పిర్యాదు దారులతో ఆయన నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు.

News November 3, 2025

పెడపల్లి: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

image

పుట్టపర్తి మండలం పెడపల్లి వద్ద సోమవారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు.. బైక్‌పై వస్తున్న ఇద్దరు వ్యక్తులను కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో మహేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడ్డ రంగాను ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. వారిని ఢీ కొన్న కారు ధర్మవరం వైపు వెళ్లింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.