News April 11, 2025
డజను కోడిగుడ్లు రూ.536!

అమెరికాలో కోడిగుడ్ల ధరలు మండిపోతున్నాయి. తాజాగా డజను కోడిగుడ్ల ధర ఏకంగా రూ.536 (6.23 డాలర్లు)కు చేరింది. బర్డ్ ఫ్లూ కారణంగా దేశంలో 3 కోట్ల కోళ్లను నిర్మూలించడం, దిగుమతులూ గణనీయంగా తగ్గిపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. బర్డ్ ఫ్లూ ఇప్పుడు తగ్గుముఖం పట్టిందని, త్వరలోనే పరిస్థితి చక్కబడుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News March 20, 2026
మరో వివాదంలో పైలట్ రోహిత్ రెడ్డి!

TG: డ్రగ్స్ కేసులో <<19404520>>అరెస్టయిన<<>> Ex MLA పైలట్ రోహిత్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. మొయినాబాద్‌లోని ఆయన ఫామ్‌హౌస్ అసైన్డ్ భూమిలో ఉన్నట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారని తెలుస్తోంది. జంగయ్య అనే వ్యక్తి పేరుతో ల్యాండ్ ఉందని సమాచారం. దీంతో ఆ భూమి రోహిత్ రెడ్డి చేతికి ఎలా వెళ్లిందనేది తెలుసుకుంటామని, ఆ తర్వాత చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. అవసరమైతే ఫామ్‌హౌస్‌ను సీజ్ చేస్తామంటున్నారు.
News March 20, 2026
PHOTO GALLERY: గద్దర్ అవార్డుల వేడుక

హైదరాబాద్ హైటెక్స్‌లో తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, చిరంజీవి, కమల్ హాసన్, నాగార్జున, జయసుధ, నారాయణ మూర్తి, రామ్ చరణ్, సహా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు, అవార్డుల విజేతలు హాజరయ్యారు. పైన గ్యాలరీలో కొన్ని ఫొటోలను చూడొచ్చు.
News March 20, 2026
మార్చి 20: చరిత్రలో ఈ రోజు

1351: ఢిల్లీ సుల్తాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్ మరణం
1602: డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపన
1980: టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ జననం
1987: టాలీవుడ్ సింగర్ హరిచరణ్ జననం
2008: సినీ నటుడు శోభన్ బాబు మరణం(ఫొటోలో)
*అంతర్జాతీయ సంతోష దినం


