News April 11, 2025

రామగుండం: 14న సింగరేణిలో వేతనంతో కూడిన సెలవు

image

భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని ఈ నెల 14న సింగరేణి ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు ప్రకటించారు. ఈ మేరకు యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే సెలవు రోజున అత్యవసర విభాగాల్లో విధులు నిర్వహించే ఉద్యోగులకు సాధారణ వేతనంతో కలిపి మూడు రేట్లు వేతనం చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Similar News

News January 8, 2026

భారీ జీతంతో నీతిఆయోగ్‌లో ఉద్యోగాలు

image

<>నీతిఆయోగ్<<>> 31 కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి PG/MBBS/BE/BTech ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం గలవారు FEB 8 వరకు అప్లై చేసుకోవచ్చు. Sr. అడ్వైజర్‌కు నెలకు రూ.3,30,000, అడ్వైజర్‌కు రూ.2,65,000, Sr. స్పెషలిస్టుకు రూ.2,20,000, స్పెషలిస్టుకు రూ.1,45,000 , Sr. అసోసియేట్‌కు 1,25,000, అసోసియేట్‌కు రూ.1,05,000 చెల్లిస్తారు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: niti.gov.in

News January 8, 2026

కాచిగూడలో హిందూ- ముస్లిం లవ్ మ్యారేజ్

image

నగరంలో అంతర్మత వివాహం చట్టబద్ధంగా నమోదైంది. హిందూ–ముస్లిం యువతి యువకుల మధ్య జరిగిన ఈ వివాహాన్ని కాచిగూడ PSలో అధికారికంగా రిజిస్ట్రేషన్ చేశారు. మేజర్ల సమ్మతితో, అన్ని చట్టపరమైన నిబంధనలు పాటిస్తూ వివాహ ప్రక్రియ పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా పోలీసు భద్రత ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు.

News January 8, 2026

భద్రాద్రి: అత్తవారింటికి వెళ్లి వస్తూ.. అనంతలోకాలకు

image

ద్విచక్ర వాహనం అదుపుతప్పి గుంతలో పడిన ఘటనలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. పోలీసుల కథనం ప్రకారం.. కొత్తగూడెం పట్టణం బూడిదగడ్డకు చెందిన గొగ్గల రాజు(29) గురువారం టేకులపల్లి మండలం బర్లగూడెంలోని అత్తవారింటికి వెళ్లాడు. తిరిగి వస్తుండగా ఒడ్డుగూడెం సమీపంలో బైకు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడిపోయింది. ఈ ప్రమాదంలో రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.