News March 27, 2024
REWIND.. నెల్లూరులో ‘ఉదయించిన సూర్యుడు’

నెల్లూరు నియోజకవర్గంలో 1989 ఎన్నికల్లో జక్కా కోదండరామి రెడ్డి(జేకే రెడ్డి) సంచలనం సృష్టించారు. అప్పట్లో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగగా ఎన్నికల కమిషన్ ఉదయించే సూర్యుడు గుర్తు కేటాయించింది. ఆ ఎన్నికల్లో ప్రచారాన్ని జేకే రెడ్డి సరికొత్త పుంతలు తొక్కించారు. అందరి మనస్సు చూరగొని తన సమీప ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి తాళ్లపాక రమేష్ రెడ్డిపై 14474 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
Similar News
News September 14, 2025
పార్లమెంటులో నెల్లూరు MP పని తీరు ఇదే.!

2024- 25వ సంవత్సరానికి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పనితీరును పార్లమెంట్ వర్గాలు వెల్లడించాయి. ఆయన పార్లమెంట్లో ప్రజా సమస్యలపై 73 ప్రశ్నలు సంధించారు. 77.94 శాతం అటెండెన్స్ కల్గి ఉన్నారు. నాలుగు చర్చా కార్యక్రమాలలో పాల్గొని ప్రజావాణి వినిపించినట్లు పార్లమెంట్ వర్గాలు నివేదికను వెల్లడించాయి.
News September 14, 2025
ఇది మన నెల్లూరు కొత్త కలెక్టర్ ప్రేమకథ.!

ప్రజలకు సేవా చేయాలన్న తపన వారిద్దరిది. IASకు ప్రయత్నించి ఒకరు మొదటి ప్రయత్నంలో, మరొకరు రెండో ప్రయత్నంలో సెలక్ట్ అయ్యారు. ట్రైనింగ్ పీరియడ్‌లో వాళ్ల మధ్య ఏర్పడ్డ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇది మన నెల్లూరు కొత్త కలెక్టర్ హిమాన్షు శుక్లా-కృతికా శుక్లా ప్రేమ కథ. ప్రస్తుతం ఆమె పల్నాడు కలెక్టర్‌గా పని చేస్తున్నారు. శనివారం ఇద్దరూ బాధ్యతలు చేపట్టారు.
News September 14, 2025
కృష్ణాపురం నవోదయలో ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్ దాష్టీకం

మర్రిపాడు మండలం కృష్ణాపురంలోని జవహర్ నవోదయ స్కూల్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. గత రాత్రి స్టడీ అవర్స్‌లో మహేష్ అనే విద్యార్థిపై ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్ పెత్తన స్వామి దాడికి పాల్పడ్డారు. దీంతో మహేశ్ తలకు తీవ్ర గాయం అయ్యింది. అంతటితో ఆగకుండా ఆ విద్యార్థిని వాష్ రూమ్‌లో లాక్ చేసిన ఉదయం వరకు లాక్ తియ్యొద్దని స్టాఫ్‌ని హెచ్చరించారు. టీచర్లు కలిసి విద్యార్థిని మర్రిపాడు ఆస్పత్రికి తరలించారు.