News April 11, 2025
దెందులూరు: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

దెందులూరు మండలం కొమరేపల్లి హైవేపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. నిడమర్రు గ్రామానికి చెందిన బాపన్న(55) పెద్ద కుమారుడికి ఈ నెల 18న వివాహం. దగ్గరి బంధువు అయిన గరిమెళ్ల అప్పారావుతో కలిసి బాపన్న బైక్‌పై బయలుదేరారు. కొడుకు పెళ్లికి సంబంధించి బంధువులకు శుభలేఖలు ఇచ్చి వస్తుండగా జరిగిన ప్రమాదంలో ఇద్దరూ మృతి చెందారు. దీంతో రెండు కుటుంబాల్లో ఈ ప్రమాదం విషాదం నింపింది.
Similar News
News July 6, 2025
ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదు: కలెక్టర్

నెల్లూరు బారాషహిద్ దర్గాలో రొట్టెల పండుగ వైభవంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం పండుగ ఏర్పాట్లు, భద్రత, వసతులను కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్ పరిశీలించారు. భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని కలెక్టర్ అధికారుల్ని ఆదేశించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు నిరంతరం పర్యవేక్షించాలని ఎస్పీ సూచించారు.
News July 6, 2025
WGL: అందరి చూపు గాంధీ భవన్ వైపే..!

HYD గాంధీ భవన్‌లో పీసీసీ క్రమశిక్షణ కమిటీ సోమవారం కీలక సమావేశం కానుంది. WGL కాంగ్రెస్ MLAలు, మంత్రి సురేఖ మధ్య విభేదాలతో వచ్చిన ఫిర్యాదులపై కమిటీ తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కొండా మురళి వ్యాఖ్యలపై MLAలు ఇప్పటికే పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్ మీనాక్షి దృష్టికి తీసుకెళ్లగా.. మురళి, సురేఖ సైతం ఆమెను కలిసి తమ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కాగా రేపటి సమావేశం వరంగల్‌లో ఉత్కంఠ రేపుతోంది.
News July 6, 2025
IIITలో 598 సీట్లు మిగిలాయి..!

IIIT సీట్ల భర్తీకి నిర్వహిస్తున్న కౌన్సెలింగ్ శనివారంతో ముగిసింది. నాలుగు క్యాంపస్‌ల్లో 598 సీట్లు మిగిలాయి. ఒక్కో IIITలో 1,010 సీట్లు ఉండగా.. ఇడుపులపాయలో 132 మిగలడం గమనార్హం. ఈ సీట్లను భర్తీ చేసేందుకు ఈనెల 14 నుంచి రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. సీట్లు పొందిన వారికి ఈనెల 14 నుంచి తరగతుల ప్రారంభమవుతాయని రిజిస్ట్రార్ వెల్లడించారు.