News April 11, 2025
సాగర్ కాల్వలకు నీటి నిలిపివేత

గతేడాది డిసెంబర్ 15 నుంచి అధికారులు సాగర్ కుడి, ఎడమ కాలువలకు ఏకధాటిగా నీటి విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే గురువారం సాయంత్రం నీటి విడుదలను నిలిపివేశారు. ఎడమ కాల్వ కింద ఉమ్మడి నల్గొండ జిల్లాలో సుమారు 4 లక్షల ఎకరాల వరకు సాగవగా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండున్నర లక్షల ఎకరాలు సాగైంది. ఈ సీజన్ లో ఎడమ కాల్వకు 74 టీఎంసీల వాటర్ రిలీజ్ చేయగా, ఎడమ కాల్వకు 100 టీఎంసీలు విడుదల చేశారు.
Similar News
News October 28, 2025
మొంథా తుపాన్.. ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో ఎర్ర హెచ్చరిక!

బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాన్ తీవ్ర వాయుగుండంగా బలపడింది. తుపానుగా మారి గంటకు 90 నుంచి 110 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ములుగు, మహబూబాబాద్, భూపాలపల్లికి రెడ్ అలెర్ట్ జారీ కాగా.. వరంగల్ జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అతి భారీ వర్షాలతో మొక్కజొన్న, పత్తి పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని అధికారులు సూచించారు.
News October 28, 2025
SRPT: ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి: కలెక్టర్

వర్షాలు కురుస్తున్న నేపద్యంలో ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోవాలని, ఆ దిశగా రైతులకు అవగాహన కల్పించాలని నిర్వాహకులకు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. సోమవారం ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహించే జాజిరెడ్డిగూడెం మండలంలో పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. రైతులకు సరిపడా టార్పాలిన్లను అందించాలని ఆదేశించారు. రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు.
News October 28, 2025
‘మొంథా’ తుపాన్.. అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

రానున్న రెండు రోజుల్లో జిల్లాపై ‘మొంథా’ తుపాన్ ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని వరంగల్ కలెక్టర్ సత్య శారద ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి లైన్ డిపార్ట్మెంట్, ఎన్డీఆర్ఎఫ్ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. తుఫాన్ నేపథ్యంలో ప్రజలు, రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.


