News April 11, 2025
సంగారెడ్డి: కాసేపట్లో ఇంటికి.. అంతలోనే విద్యార్థి మృతి

కొండాపూర్‌లో పిడుగు పడి విద్యార్థి మృతి చెందాడు. స్థానికుల వివరాలు.. గంగారానికి చెందిన సంతోశ్ సదాశివపేటలో ఐటీఐ చదువుతున్నాడు. కళాశాల నుంచి తన స్నేహితులతో ఇంటికి వస్తుండగా భారీ వర్షం రావడంతో ఒక చెట్టు కింద ఆగారు. ఉరుములతో కూడిన వర్షం కురవడంతో పిడుగుపడి సంతోశ్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News September 19, 2025
కార్ల ధరలు తగ్గించిన మారుతి సుజుకీ

కొత్త GST రేట్ల నేపథ్యంలో మారుతి సుజుకి కార్ల ధరలను తగ్గించింది. S-ప్రెసోపై రూ.1,29,600, ఆల్టో K10పై రూ.1,07,600, సెలేరియోపై రూ.94,100, డిజైర్‌పై రూ.87,700, వ్యాగన్-Rపై రూ.79,600, ఇగ్నిస్‌పై రూ.71,300, స్విఫ్ట్‌పై రూ.84,600, బాలెనోపై రూ.86,100, ఫ్రాంక్స్‌పై రూ.1,12,600, బ్రెజ్జాపై రూ.1,12,700, గ్రాండ్ విటారాపై రూ.1,07,000, జిమ్నీపై రూ.51,900, ఎర్టిగాపై రూ.46,400 మేర ధరలు తగ్గించింది.
News September 19, 2025
వైసీపీ కూటమి ప్రభుత్వానికి అప్పులు అప్పగించింది: పుల్లారావు

గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ ప్రతి పథకానికి తన బొమ్మ వేసుకోవాలనుకున్నారని, అందుకే స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ నిలిచిపోయిందని MLA ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. కూటమి ప్రభుత్వంలో దేశంలో అమలు కాని పథకాలన్నీ అమలవుతాయన్నారు. గత ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి అప్పులు అప్పగించిందని ఆయన విమర్శించారు. చిలకలూరిపేటలో స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
News September 19, 2025
కడప: అత్యాచారం కేసులో 10 ఏళ్ల జైలు శిక్ష

బాలికను అత్యాచారం చేసిన కేసులో వేంపల్లెకు చెందిన తమ్మిశెట్టి రామాంజనేయులుకు కడప పోక్సో కోర్టు ఇన్‌ఛార్జ్ జడ్జి యామిని 10 ఏళ్లు జైలు శిక్ష, రూ. 3 వేలు జరిమానా విధించారు. 15 ఏళ్ల బాలికను రామాంజనేయులు బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు ఆమె తల్లి 2019లో వేంపల్లె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. DSP వాసుదేవన్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నేరం రుజువు కావడంతో శిక్ష పడింది.