News April 11, 2025

గుంటూరు: అగ్నివీర్ నియామకాల గడువు పొడిగింపు

image

భారత సైన్యంలో అగ్నిపథ్ ద్వారా అగ్నివీర్ నియామకాల ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ గడువును ఏప్రిల్ 25 వరకు పెంచినట్లు గుంటూరు రిక్రూటింగ్ కార్యాలయం తెలిపింది. జూన్‌లో 13 భాషల్లో జరిగే కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్‌ తెలుగులోనూ నిర్వహించనున్నారు. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం సహా పలు జిల్లాల అభ్యర్థులు అగ్నివీర్ టెక్నికల్, జీడీ, ట్రేడ్స్ మెన్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

Similar News

News January 17, 2026

సంగారెడ్డిలో 19న ప్రజావాణి రద్దు

image

సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో ఈనెల 19న జరగాల్సిన ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మున్సిపల్ ఎన్నికల విధుల్లో జిల్లా అధికారులు నిమగ్నమైనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు ఈ మార్పును గమనించాలని, తదుపరి నిర్వహణ తేదీని త్వరలోనే వెల్లడిస్తామని ఆమె వివరించారు.

News January 17, 2026

ఉమ్మడి నల్గొండ జిల్లాలో రిజర్వేషన్లు ఇలా..

image

NLG మేయర్ (జనరల్ మహిళ), MLG (జనరల్ మహిళ), DVK (బీసీ మహిళా), హాలియా (UR ), నందికొండ (SC జనరల్), చండూరు (UR), చిట్యాల (జనరల్ మహిళ), SRPT (UR), KDD(జనరల్ మహిళ), HNR (బీసీ జనరల్), నేరేడుచర్ల (UR), తిరుమలగిరి (UR), భువనగిరి (జనరల్ మహిళ), చౌటుప్పల్ (జనరల్ మహిళ ), యాదగిరిగుట్ట (జనరల్ మహిళ), పోచంపల్లి (UR), మోత్కూరు (ఎస్సీ మహిళ ), ఆలేరు (బీసీ మహిళ).

News January 17, 2026

REWIND: 1947-77 నాగోబా జాతర దృశ్యం

image

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో 1947 నుంచి ఆదివాసీ మెస్రం వంశీయుల ఆరాధ్యదైవం శ్రీ నాగోబా దేవత పుణ్యక్షేత్రం వెలిసింది. ఆనాటి నుంచి మెస్రం వంశీయులు ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు చేస్తూ తమ సంప్రదాయాన్ని కాపాడుతున్నారు. ఏటా పుష్య మాసాన్ని పురస్కరించుకొని మహాపూజను నిర్వహించి జాతరను ప్రారంభిస్తారు. ఆదివారం(రేపు) మహాపూజ జరగనుంది.