News April 11, 2025

‘ఒంటిమిట్ట’ అనే పేరు ఎలా వచ్చిందంటే?

image

ఒంటుడు, మిట్టుడు అనే ఇద్దరు రామ భక్తులు ఈ ఆలయాన్ని నిర్మించారు. నిర్మాణం పూర్తయిన తర్వాత వారు తమ జీవితాలను అంతం చేసుకున్నారు. వారి శిలా విగ్రహాలు ఆలయంలో ప్రవేశించటానికి ముందు చూడవచ్చు. వారి పేర్ల మీద ఒంటిమిట్ట అనే పేరు వచ్చిందని అంటారు. ఈ ఆలయంలోని విగ్రహాలు ఒకే శిలలో మలచబడ్డాయి. అందుకే దీనికి ఏక శిలా నగరమనే పేరు వచ్చింది. దేశంలో ఆంజనేయస్వామి లేకుండా రాములవారు ఉన్న ఆలయం ఇదొక్కటే.

Similar News

News March 21, 2026

వాహనదారులకు రిలీఫ్.. ఎల్లుండి నుంచి..

image

TG: ఒకే పేరుపై రెండో వాహనం కొంటే అదనంగా కట్టాల్సిన 2% లైఫ్ ట్యాక్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నెల 23 నుంచి ఇది అమల్లోకి రానుంది. దీంతో వాహనదారులకు ఊరట లభించనుంది. ఇక అదే రోజున రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ ‘వాహన్’ పోర్టల్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ లాంచ్ చేయనున్నారు. రాష్ట్ర వాహనాల డేటా ఆ పోర్టల్‌తో అనుసంధానం కానుంది. దీంతో అంతర్రాష్ట్ర వాహనాల కొనుగోలు చేస్తే రిజిస్ట్రేషన్ ఈజీ అవుతుంది.

News March 21, 2026

కాకినాడలో 140 మెట్రిక్ టన్నుల బియ్యం సీజ్

image

విదేశాలకు అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని డీఎస్‌ఓ సత్యనారాయణ రాజు దాడి చేసి పట్టుకున్నారు. కాకినాడ పోర్టులో ఐదు లారీల్లో 140 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేస్తుండగా డీఎస్ఓ శనివారం అడ్డుకున్నారు. మొత్తం 140 టన్నుల బియ్యం ఖరీదు రూ.65 లక్షలు ఉంటుందని ఆయన చెప్పారు. ధాన్యాన్ని, ఎక్స్‌పోర్టు చేస్తున్న లారీలను సీజ్ చేశామన్నారు. పీడీఎస్ రైస్‌ను క్రయవిక్రయాలు జరిపితే కేసులు తప్పవని హెచ్చరించారు.

News March 21, 2026

విడాకులపై స్పందించిన నిహారిక

image

తాను రిలేషన్‌షిప్ నుంచి బయటకు రావాలనుకున్నప్పుడు ముందుగా తన తండ్రికే చెప్పానని మెగా డాటర్ నిహారిక ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆయన మొత్తం విని సైలెంట్ అయ్యారని, తాను సంతోషంగా లేననే విషయం వాళ్లకూ తెలుసన్నారు. జీవితంలో సంతోషంగా లేకపోతే బలవంతంగా ఉండాల్సిన అవసరం లేదని నాన్నే సలహా ఇచ్చారని పేర్కొన్నారు. తమ మధ్య వచ్చిన విభేదాలు పరిష్కరించుకోలేనివని, అందుకే 2023లో విడాకులు తీసుకున్నామని చెప్పారు.