News April 11, 2025

హన్మకొండ: ఉరేసుకొని సింగరేణి ఉద్యోగి ఆత్మహత్య

image

ఆర్థిక ఇబ్బందులతో సింగరేణి ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన కాజీపేటలో జరిగింది. SI నవీన్ కుమార్ వివరాల ప్రకారం.. కాజీపేటకు చెందిన సంజయ్ కుమార్(26) కొత్తగూడెం సింగరేణి వర్క్‌షాప్‌లో మూడేళ్లుగా పని చేస్తున్నాడు. అయితే కాజీపేటలోని బాపూజీనగర్ కాలనీలో మూడు నెలల క్రితం రూ.76లక్షలతో ఇల్లు కొన్నాడు. దీంతో అప్పులు, వడ్డీలు పెరగడంతో మనస్తాపానికి గురై అమ్మమ్మ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Similar News

News November 10, 2025

మధిరలో 23న కళాకారుల వన సమారాధన

image

ఖమ్మం కొత్తగూడెం జిల్లాల కళాకారుల కోసం ఈ నెల 23న వన సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సీతారామాంజనేయ కళాపరిషత్ ఆధ్వర్యంలో మధిర మండలం ఆత్కూరులోని అబ్బూరి రామకృష్ణ మామిడి తోటలో ఈ కార్యక్రమం జరగనుంది. 2014 నుంచి ప్రతి ఏటా ఈ వనభోజనాలను నిర్వహిస్తున్నారు. రెండు జిల్లాల కళాకారులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పరిషత్ అధ్యక్షులు కోరారు.

News November 10, 2025

బాండా వర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ & టెక్నాలజీలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

బాండా వర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ & టెక్నాలజీలో 38 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, Asst ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి M.V.SC, పీహెచ్‌డీతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీతో పాటు డాక్యుమెంట్స్‌ను స్పీడ్ పోస్ట్ ద్వారా పంపాలి. టీచింగ్ స్కిల్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://buat.edu.in/

News November 10, 2025

జూబ్లీ బైపోల్: ప్రజాస్వామ్యానికి ప్రాణం ఓటు!

image

ప్రజాస్వామ్యం పటిష్ఠం కావాలంటే ప్రతి ఓటు కీలకం. ఓటు హక్కు మాత్రమే కాదు, భవిష్యత్తుకి బలం. పార్టీ, వ్యక్తి, వాగ్ధానాల కన్నా రాష్ట్రం కోసం ఆలోచించాలి. ఓటుతో మార్పు తీసుకురావాలి. ఒక్క ఓటు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అభివృద్ధి, మంచి పాలన కోసం ఓటు వేయడం ప్రతి పౌరుడి పవిత్ర బాధ్యత. సెలవు దినం కాదు, సమాజానికి సమర్పణ రోజు అని గుర్తుంచుకోవాలి.
☛రేపే జూబ్లీహిల్స్ బైపోల్ పోలింగ్