News April 11, 2025

HYD: జిమ్ ట్రైనర్ హత్య.. నిందితుల రిమాండ్

image

బోడుప్పల్‌లో జిమ్ ట్రైనర్‌ మర్డర్ వివరాలను పోలీసులు వెల్లడించారు. ఇందిరానగర్‌కు చెందిన చంటి భార్యతో జిమ్ ట్రెయినర్ సాయికిషోర్‌ చనువుగా ఉంటున్నాడనే అనుమానంతో ఆమెను ప్రశ్నించాడు. దీంతో పుట్టింటికి వెళ్లింది. కక్షగట్టిన చంటి మర్డర్‌కు ప్లాన్ చేసి స్నేహితులు ధ్రువకుమార్‌సింగ్, శ్రీకాంత్, సాయికిరణ్‌‌తో కలిసి జిమ్‌లోనే అతడిపై డంబెల్‌తో దాడిచేయగా మృతిచెందాడు. రాత్రి నిందితులను రిమాండ్ చేశారు.

Similar News

News March 11, 2026

శ్రీనిధి రకం కోళ్ల ప్రత్యేకత ఏమిటి?

image

శ్రీనిధి జాతి కోళ్లు గోధుమ రంగులో ఉంటాయి. నాటుకోడి గుడ్లకు సమానంగా ఈ కోడి గుడ్లు కూడా అధిక పోషకాలను కలిగి ఉంటాయి. ఈ కోళ్లు 5 నెలల వయసు నుంచే గుడ్లను పెట్టడం ప్రారంభిస్తాయి. ఏడాదికి 140 నుంచి 160 గుడ్లను పెడతాయి. అన్ని వాతావరణ పరిస్థితులను, కొన్ని రకాల వ్యాధులను తట్టుకొని జీవిస్తాయి. పొడవైన కాళ్లతో, ఆకర్షణీయంగా ఉంటాయి. పెరటికోళ్లు పెంచాలనుకునేవారికి శ్రీనిధి కోళ్లు కూడా అనుకూలమైనవి.

News March 11, 2026

స్టేషన్ ఘన్‌పూర్‌లో ఉప ఎన్నిక తప్పదా..?

image

స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక తప్పేలా లేదు. ఇప్పటికే స్పీకర్ ఇరువురి వాదనలు విని, తన తీర్పును ఈరోజుకు వాయిదా వేశారు. గత పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల ప్రచారం తాలూకు వీడియోలను స్పీకర్‌కు ప్రతివాదులు అందజేశారు. కడియం శ్రీహరిపై నమోదైన అనర్హత పిటిషన్‌ను ఇప్పటికే విచారించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.. తన తీర్పును ఈరోజు ఉదయం 10 గంటలకు వెలువరించనున్నారు.

News March 11, 2026

శ్రీకాకుళం: చోరీ కేసులో వ్యక్తికి ఆరునెలలు జైలు శిక్ష

image

రైళ్లలో ప్రయాణీకుల సెల్ ఫోన్లు, ఛార్జర్లు చోరీకు పాల్పడుతున్న వ్యక్తికి ఆరునెలలు జైలు శిక్ష పడింది. ఒడిశా రాష్ట్రం బరంపురం సమీపంలోని నారాయణపూర్‌కి చెందిన జగదీశ్ రెడ్డి అనే యువకుడికి ఆరునెలలు జైలు శిక్ష విధించినట్లు పలాస జీఆర్పీ ఎస్ఐ సోమేశ్వరరావు మంగళవారం తెలిపారు. చోరీకి పాల్పడుతున్న వ్యక్తిని పట్టుకుని విచారణ జరిపి విశాఖ రైల్వే కోర్టులో హాజరుపరచడంతో కోర్టు ఈ తీర్పు ఇచ్చిందని ఎస్ఐ పేర్కొన్నారు.