News April 11, 2025
సాగర్ కాల్వలకు నీటి నిలిపివేత

గతేడాది డిసెంబర్ 15 నుంచి అధికారులు సాగర్ కుడి, ఎడమ కాలువలకు ఏకధాటిగా నీటి విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే గురువారం సాయంత్రం నీటి విడుదలను నిలిపివేశారు. ఎడమ కాల్వ కింద ఉమ్మడి నల్గొండ జిల్లాలో సుమారు 4 లక్షల ఎకరాల వరకు సాగవగా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండున్నర లక్షల ఎకరాలు సాగైంది. ఈ సీజన్ లో ఎడమ కాల్వకు 74 టీఎంసీల వాటర్ రిలీజ్ చేయగా, కుడి కాల్వకు 100 టీఎంసీలు విడుదల చేశారు.
Similar News
News January 2, 2026
నెల్లూరు: సర్పంచ్ ఎన్నికలు అప్పుడేనా..?

సర్పంచ్ ఎన్నికలు జనవరిలోనే జరపాలని ప్రభుత్వం గతంలో చెప్పడంతో నెల్లూరు జిల్లాలో గ్రామ రాజకీయాలు స్పీడందుకున్నాయి. జిల్లాలోని 722 పంచాయతీల్లో నాయకులు మంతనాలు ప్రారంభించారు. నిబంధనల ప్రకారం సర్పంచ్ పదవిలో ఉన్నప్పుడు పంచాయతీ విభజన జరగకూడదు. ప్రస్తుత సర్పంచ్‌ల గడువు ఏప్రిల్‌తో ముగుస్తుంది. ఆ తర్వాతే పంచాయతీల విభజన చేసిన జూన్ లేదా జులైలో ఎన్నికలు నిర్వహించనున్నారు. దీంతో పల్లె రాజకీయాలు స్లో అయ్యాయి.
News January 2, 2026
NTR: మద్యం జోరు.. నెలలోనే రూ. 155 కోట్ల విక్రయాలు

న్యూఇయర్ వేడుకల వేళ ఉమ్మడి కృష్ణా జిల్లాలో మద్యం విక్రయాలు రికార్డు స్థాయికి చేరాయి. DECలో జిల్లా వ్యాప్తంగా ఏకంగా రూ.155కోట్లకు పైగా విలువైన మద్యం అమ్ముడైంది. గతేడాది DEC 31న రూ.11.64కోట్లు రాగా, ఈ ఏడాది రూ.17.20కోట్లకు పెరిగింది. పండుగ సీజన్, వేడుకల వేళ మందుబాబులు ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం తెచ్చిపెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక అమ్మకాలు జరిగిన జిల్లాల్లో NTR జిల్లా 3వ స్థానంలో నిలిచింది.
News January 2, 2026
అయ్యప్ప యోగ ముద్ర వెన్నెముకకు రక్ష

అయ్యప్ప స్వామి కూర్చునే స్థితి ఓ ఆసనమే కాదు! వెన్నెముక ఆరోగ్యాన్ని కాపాడే అద్భుతమైన మార్గం కూడా! ఈ స్థితిలో కూర్చోవడం వల్ల వెన్నుపాము నిటారుగా ఉండి, మన శరీరంలోని ప్రాణశక్తి కింద నుంచి పైకి సాఫీగా ప్రవహిస్తుంది. దీనివల్ల నడుము నొప్పి దరిచేరదు. నరాల వ్యవస్థ ఉత్తేజితమవుతుంది. ఈ భంగిమ మనస్సును నిలకడగా ఉంచి, ఏకాగ్రతను పెంచుతుంది. యోగ శాస్త్రం ప్రకారం.. ఇది అంతర్గత అవయవాల పనితీరును మెరుగుపరుస్తుంది.


