News April 11, 2025

HYD: ఉద్యమకారులపై కేసులను ఎత్తివేయాలి: MDUV

image

మూడు దశాబ్దాల ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పోరాటంలో ఉద్యమకారులపై నమోదైన కేసులను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేయాలని మాదిగ దండోర ఉద్యమకారుల వేదిక (ఎండీయూవీ) రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేసింది. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్ సమావేశంలో పలువురు మాట్లాడుతూ.. ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు 250 గజాల స్థలం ఇవ్వడంతోపాటు ఇల్లు నిర్మించి ఇవ్వాలని, అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చలాన్నారు.

Similar News

News March 15, 2026

KTDM: ప్రియుడితో కలిసి భర్త హత్య.. కూతురు చెప్పడంతో వీడిన మిస్టరీ

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తిప్పనపల్లిలో ఎస్‌డీ జాఫర్ హత్య కలకలం రేపింది. భార్య ఖతీజా ప్రియుడి సహాయంతో భర్తను హత్య చేసి మద్యం తాగడంతో చనిపోయాడని, సహజ మరణంగా చిత్రీకరించింది. అంత్యక్రియల తర్వాత ఎనిమిదేళ్ల కుమార్తె చెప్పిన వివరాలతో విషయం వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 15, 2026

మార్చి 31లోపు ఈ పనులు చేయండి!

image

FY26 ముగిసేలోపు(మార్చి 31) పొదుపు ఖాతాల్లో కనీస మొత్తం డిపాజిట్ చేయాలి. లేదంటే అవి బ్లాక్ అయ్యే ప్రమాదం ఉంది. రీయాక్టివేట్ చేయడానికి ఫైన్ చెల్లించాలి.
* పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో ఏటా కనీసం ₹500 డిపాజిట్ చేయాలి. లేదంటే ₹50 జరిమానా.
* సుకన్య సమృద్ధి యోజన యాక్టివ్‌గా ఉండాలంటే ₹250 డిపాజిట్ చేయాలి. లేదంటే ₹50 ఫైన్.
* నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో ఏటా ₹1,000 డిపాజిట్ చేయాలి. లేదంటే ₹100 పెనాల్టీ.

News March 15, 2026

KMR: ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

image

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించే ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కోరారు. ప్రజలు తమ సమస్యలపై నేరుగా ఫిర్యాదులు చేయవచ్చని, అందిన అర్జీలను అధికారులు తక్షణమే పరిశీలించి పరిష్కరిస్తారని ఆయన ఆదివారం తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఈ వేదికను వాడుకోవాలని సూచించారు.