News April 11, 2025
దేశాయిపల్లిలో మూడు కాళ్లకోడి

తంగళ్ళపల్లి మండలం దేశాయిపల్లిలో మూడు కాళ్ళ కోడిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. దేశాయిపల్లిలో రాజిరెడ్డి ఓ పౌల్ట్రీ ఫామ్ నడుపుతున్నాడు. గురువారం కోళ్లకు దాణ వేసే క్రమంలో మూడు కాళ్ల కోడిని గుర్తించినట్టు రాజిరెడ్డి తెలిపాడు. ఈ విషయం గ్రామంలో అందరికీ తెలియడంతో గ్రామస్థులు మూడు కాళ్ల కోడిని ఆసక్తిగా చూశారు.
Similar News
News January 3, 2026
ASF: స్కాలర్‌షిప్ దరఖాస్తు గడువు పొడిగింపు

ఆసిఫాబాద్ జిల్లా విద్యార్థులకు 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన పోస్ట్‌మెట్రిక్ ఉపకారవేతనాల దరఖాస్తుల గడువును మార్చి 31 వరకు పొడిగించారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో చదువుతున్న అర్హులైన విద్యార్థులు www.telanganapass.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మెడికల్ కళాశాల అధికారి తెలిపారు.
News January 3, 2026
అకౌంట్‌లో పడిన ₹40Crతో ట్రేడింగ్.. హైకోర్టు ఏమందంటే?

ముంబైకి చెందిన గజానన్ అనే ట్రేడర్ టాలెంట్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కోటక్ సెక్యూరిటీస్ పొరపాటున ₹40Cr మార్జిన్‌ను అతడి అకౌంట్‌లో వేసింది. వాటితో ట్రేడింగ్ చేసి అతను 20 ని.ల్లో ₹1.75Cr లాభం పొందాడు. ఆ లాభాన్నీ తిరిగి పొందాలని బ్రోకరేజ్ సంస్థ బాంబే హైకోర్టును ఆశ్రయించింది. ట్రేడర్ నైపుణ్యం వల్ల ఆ లాభం వచ్చిందని, తదుపరి విచారణ (FEB 4) వరకూ అతని వద్దే ఉంచుకోవచ్చని మధ్యంతర తీర్పునిచ్చింది.
News January 3, 2026
తెల్లవారుజామున ప్రయాణాలు చేయకండి: వరంగల్ సీపీ

వాతావరణంలో పొగమంచు తీవ్రత పెరగడంతో వీలైనంత వరకు వాహనదారులు రాత్రి, తెల్లవారుజామున ప్రయాణాలు చేయొద్దని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ సూచించారు. దట్టమైన పొగమంచు కారణంగా రహదారులపై ఎదురుగా వచ్చే వాహనాలు, పాదాచారులను గుర్తించేందుకు వీక్షణ సామర్థ్యం తక్కువగా ఉంటుందన్నారు. ఈ సమయంలో చిన్నపాటి నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశాలు ఉన్నందున, ప్రజలు ఈ సమయాల్లో ప్రయాణాలను మానుకోవాలన్నారు.


