News April 11, 2025
నాగర్‌కర్నూల్: సళేశ్వరానికి వచ్చే భక్తుల ఆరోగ్యంపై హెచ్చరిక

సళేశ్వరం లింగమయ్య జాతర నేటి నుంచి 13 వరకు వైభవంగా నిర్వహించనున్నారు. అధికారులు భద్రతా ఏర్పాట్లపై దృష్టి సారించారు. రాకపోకలు, మెడికల్ సదుపాయాలు, శుద్ధి చర్యలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వైద్య నిపుణులు సూచిస్తూ, గుండె సంబంధిత సమస్యలున్న భక్తులు శరీరాన్ని ఒత్తిడికి గురిచేయకుండా విశ్రాంతిగా యాత్ర చేయాలని సూచిస్తున్నారు. అధిక రద్దీ సమయంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
Similar News
News January 12, 2026
మాజీ మంత్రి కన్నుమూత

AP: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ కన్నుమూశారు. మెదడులో రక్తం గడ్డ కట్టే సమస్యతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి 4 సార్లు(1985, 89, 94, 99) టీడీపీ తరఫున పోటీ చేసి MLAగా గెలిచారు. ఎన్టీఆర్ హయాంలో 2 సార్లు మంత్రిగా పనిచేశారు. 2024 నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
News January 12, 2026
అర్జీల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి: ఎస్పీ

పీజీఆర్‌ఎస్ అర్జీల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన 16 మంది బాధితుల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. వీటిని తక్షణమే సంబంధిత అధికారులకు పంపి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సూచించారు. బాధితులకు సత్వర న్యాయం అందేలా చూడాలని ఈ సందర్భంగా ఎస్పీ స్పష్టం చేశారు.
News January 12, 2026
గొల్లప్రోలు: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

గొల్లప్రోలు మండలం చేబ్రోలు వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్గాప్రసాద్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కత్తిపూడి నుంచి పిఠాపురం వైపు ముగ్గురు యువకులు వెళ్తుండగా, శ్రీకాకుళం నుంచి వస్తున్న లారీ వారిని బలంగా ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలవ్వడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


