News April 11, 2025

GNT: వేసవిలో తిరుపతి-శిర్డీ యాత్రికుల కోసం ప్రత్యేక రైళ్లు  

image

వేసవి సెలవుల్లో తిరుపతి, శిర్డీ యాత్రికుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. మే 13 నుంచి జూన్ 28 వరకు ప్రతి ఆదివారం తిరుపతి నుంచి శిర్డీకి నంబర్ 07037 రైలు నడుస్తుంది. చీరాల, బాపట్ల, తెనాలి, గుంటూరు, సత్తెనపల్లి మీదుగా శిర్డీకి చేరుతుంది. తిరుగు ప్రయాణంగా నంబర్ 07638 రైలు మే 14 నుంచి జూన్ 30 వరకు ప్రతి సోమవారం శిర్డీ నుంచి బయలుదేరి మంగళవారం తిరుపతికి చేరనుంది.

Similar News

News September 11, 2025

నేపాల్‌లో చిక్కున్న AP వాసులను తీసుకొచ్చేలా చర్యలు

image

నేపాల్‌లో చిక్కున్న AP వాసులను రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు తీసుకుంటున్న ఏర్పాట్లను వెలగపూడిలోని సచివాలయం RTGSలో  మంత్రులు అనిత, నారా లోకేశ్ సమీక్షిస్తున్నారు. నేటి సాయంత్రం లోగా AP వాసులను విమానాల ద్వారా రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి విదేశాంగ శాఖ, AP భవన్ అధికారులతో చర్చిస్తున్నారు. విమానాశ్రయాలకు చేరుకునే వారికి స్వాగతం పలకాలని లోకేష్ ఆదేశించారు.

News September 11, 2025

ఇది గుంటూరు జిల్లా ప్రజలు గర్వించదగిన క్షణం

image

కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ నిర్వహించిన జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమం (NCAP) కింద జరిగిన ‘స్వచ్ఛ వాయు సర్వేక్షణ్‌’లో గుంటూరు నగరం అరుదైన రికార్డు సృష్టించింది. ఈ సర్వేలో గుంటూరు దేశవ్యాప్తంగా ఆరో ర్యాంకును సాధించింది. దక్షిణాది రాష్ట్రాల నుంచి టాప్ టెన్‌లో స్థానం పొందిన ఏకైక నగరం గుంటూరు. ఇది గుంటూరు జిల్లా ప్రజలకు గర్వకారణమని అధికారులు తెలిపారు.

News September 10, 2025

గుంటూరు సంయుక్త కలెక్టర్‌గా అశుతోష్ శ్రీవాత్సవ బాధ్యతలు

image

గుంటూరు జిల్లా సంయుక్త కలెక్టర్‌గా అశుతోష్ శ్రీవాత్సవ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో భాగంగా ఆయన గుంటూరుకు వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మీని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను బహూకరించారు. జిల్లా రెవెన్యూ అధికారి ఖాజావలి, డివిజనల్ అధికారి శ్రీనివాసరావు, ఏవో పూర్ణచంద్రరావు తదితరులు సంయుక్త కలెక్టర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.