News April 11, 2025
నేడు ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమం

వయోవృద్ధులు, వికలాంగుల కోసం ఈ నెల 11న శుక్రవారం (నేడు) రోజున ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు విచ్చేసి గ్రీవెన్స్ డేను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రత్యేక శ్రద్ధతో అర్జీల పరిష్కారానికి కృషి చేయనున్నట్లు తెలిపారు.
Similar News
News April 3, 2026
NLG: నామినేటెడ్ ‘కొలువు’లకై.. ఎదురుచూపులు!

జిల్లాలో అధికార కాంగ్రెస్ శ్రేణుల్లో నామినేటెడ్ పదవుల సందడి నెలకొన్నా, ఆశావహులకు మాత్రం ఎదురుచూపులు తప్పడం లేదు. ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు గడుస్తున్నా, జిల్లా స్థాయి కార్పొరేషన్లు, కమిటీల భర్తీ ప్రక్రియ నత్తనడకన సాగుతుండటంతో ద్వితీయ శ్రేణి నాయకత్వం తీవ్ర నిరాశలో మునిగిపోయింది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జెండా మోసి.. ఇప్పుడు తమకు గుర్తింపు దక్కడం లేదని అంతర్గతంగా మదన పడుతున్నారు.
News April 3, 2026
నల్గొండ: నకిలీ విత్తనాలపై ‘స్పెషల్ ఆపరేషన్’

వానాకాలం సాగు వేళ నకిలీ పత్తి విత్తనాల విక్రయదారుల ఆట కట్టించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. ఈ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 5.13 లక్షల ఎకరాల్లో పత్తి సాగు అవుతుందని అంచనా వేయగా, ఇందుకోసం సుమారు17 లక్షల విత్తన ప్యాకెట్లు అవసరమని అధికారులు గుర్తించారు. విడి విత్తనాల అక్రమ రవాణాను అరికట్టేందుకు త్రిముఖ వ్యూహంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వ్యాపారుల కదలికలపై నిరంతర నిఘా ఉంచనున్నారు.
News April 3, 2026
NLG: 20 వరకు పాలిటెక్నిక్ ఫీజు గడువు

పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష ఫీజు ఈనెల 20వ తేదీలోపు చెల్లించాలని NLG ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ CH.నర్సింహారావు తెలిపారు. టెన్త్ లేదా సమాన పరీక్ష ఉత్తీర్ణులైన విద్యార్థులకు పాలిటెక్నిక్ కోర్సులో ప్రవేశానికి మే 13న పాలీసెట్-2026 నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. టెన్త్ హాల్టికెట్, ఆధార్, కుల ధ్రువీకరణ పత్రం కలిగి ఉన్న వారు polycet.sbtet.telangana.gov.inలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.


