News April 11, 2025

NLG: కొన్ని రేషన్ షాపుల్లో బియ్యం కొరత

image

జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లోని రేషన్ షాపుల్లో బియ్యం కొరత ఏర్పడింది. రేషన్ కార్డు దారులు రాష్ట్రంలో ఎక్కడైనా బియ్యం తీసుకునే వెసులుబాటు ఉండటంతో గ్రామాల నుంచి, ఇతర ప్రదేశాల నుంచి పలు పనుల నిమిత్తం పట్టణాల్లో నివసిస్తుంటారు. అలాంటి వారు కూడా పట్టణంలోని పలు షాపుల్లో సన్నబియ్యం తీసుకోవడంతో బియ్యం కొరత ఏర్పడింది. ఉమ్మడి జిల్లాలో ఇంకా 31,22,941 కిలోల బియ్యం పంపిణీ చేయాల్సి ఉంది.

Similar News

News January 2, 2026

NLG: అభ్యర్థుల ఎంపికపై పార్టీల దృష్టి

image

రిజర్వేషన్లు-నామినేషన్లకు మధ్యలో సమయం ఉండే అవకాశం లేకపోవడంతో అన్ని రాజకీయ పార్టీలు తమ వ్యూహాలను అమలు చేస్తున్నాయి. వార్డులవారీగా అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే స్పష్టతకు వచ్చినట్లు సమాచారం. రిజర్వేషన్ అనుకూలించినా లేకపోయినా ముందు జాగ్రత్తగా ప్రతీవార్డుకు కులాల వారీగా అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు వార్డుల వారీగా ఆశావాహుల జాబితా రూపొందించే పనిలో పడ్డాయి

News January 1, 2026

మంత్రి కోమటిరెడ్డిని కలిసిన నల్గొండ కొత్త కలెక్టర్

image

రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిని నూతన కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ ఈ రోజు హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నల్గొండ నూతన కలెక్టర్‌కు మంత్రి శుభాకాంక్షలు తెలిపి, ఆల్ ది బెస్ట్ చెప్పారు.

News January 1, 2026

నల్గొండ: 25 జీపీల్లో నూతన అకౌంట్లు

image

నల్గొండ జిల్లాలో కొత్తగా ఏర్పడిన 25 గ్రామ పంచాయతీల్లో కొత్తగా బ్యాంక్ అకౌంట్లు తెరవాలని పంచాయతీరాజ్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం మూడు అకౌంట్లు తెరవాల్సి ఉంటుంది. 15వ ఆర్థిక సంఘం నిధులకు ఒక అకౌంట్, రాష్ట్ర ప్రణాళిక సంఘం నిధులకు మరో అకౌంట్‌తో పాటు గ్రామపంచాయతీ నిధులకు సంబంధించి మూడో అకౌంట్ తీయాలని ఉత్తర్వులు ఇవ్వడంతో కొత్త పంచాయతీల్లో కొత్త అకౌంట్లు తెరిచారు.