News April 11, 2025
నారాయణపేట: మార్కెట్‌లో ధరలు లేక ఉల్లి రైతుల ఆందోళన

ఈ ఏడాది ఆశించిన స్థాయిలో ఉల్లి ధరలు లేకపోవడంతో నారాయణపేటలోని పలువురు రైతులు పంటను కోసి పొలాల వద్ద నిల్వ చేశారు. మార్కెట్‌లో రోజు రోజుకు ఉల్లి ధరలు పడిపోతుండడమే ఇందుకు కారణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట దిగుబడి పెరిగినా.. తగ్గినా గిట్టుబాటు ధరలు లేక రైతులు కోసిన ఉల్లి పంటను పొలాల వద్ద, ఇంటి వద్ద నిల్వ చేసుకున్నారు. రానున్న రోజుల్లో ఉల్లి ధరలు పెరుగుతాయన్న ఆశతో రైతులు ఎదురుచూస్తున్నారు.
Similar News
News April 6, 2026
మండపేట: కాలువలో పడ్డ కారు.. దంపతులు మృతి

మండపేట మండలం తాపేశ్వరం శివారు పేకేటిపాకలు వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. రూరల్ CI దొరరాజు తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడ నుంచి వెలగతోడు వెళ్తుండగా కారు అదుపుతప్పి కాలువలో పడింది. ఈ ప్రమాదంలో బోగిల్లి వీర వెంకట సతీశ్ (40), ఆయన భార్య బోగిల్లి కిరణ్మయి (36) నీటిలో మునిగి మరణించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News April 6, 2026
MBNR: ఉపాధి కార్యాలయంలో కెరీర్ గైడెన్స్: రిజిస్ట్రేషన్లకు ఆహ్వానం

మహబూబ్ నగర్ జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయం & నిర్మాణ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కమ్యూనికేషన్ స్కిల్స్, కెరీర్ ప్లానింగ్ తదితర వాటిపై శిక్షణ ఇస్తున్నట్లు ఉపాధి అధికారిణి మైత్రి ప్రియ ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. ఈనెల 8, 9న శిక్షణ ఇస్తున్నామని, ఆసక్తి ఉన్నవాళ్లు https://forms.gle /a7ComMvBg6wmPXhT9 వెబ్ సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. SHARE IT.
News April 6, 2026
జగిత్యాల: ప్రజావాణికి వచ్చిన యూట్యూబర్ గంగవ్వ

జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి యూట్యూబర్ గంగవ్వ సోమవారం వచ్చారు. తన స్వగ్రామమైన మల్యాల మండలం లంబాడిపెల్లి గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని గ్రామ నాయకులు, రైతులతో కలిసి అధికారులకు వినతి పత్రం సమర్పించారు. కొనుగోలు కేంద్రాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని కోరారు.


