News April 11, 2025

OTTలోకి వచ్చేసిన 4 సూపర్ హిట్ చిత్రాలు

image

ఇవాళ 4 సూపర్ హిట్ చిత్రాలు ఓటీటీలోకి వచ్చేశాయి. తమిళంలో మంచి విజయం సాధించిన ‘పెరుసు’ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాకు IMDbలో 8.1/10 రేటింగ్ ఉంది. హిందీలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘ఛావా’, తెలుగులో సూపర్ హిట్టయిన ‘కోర్ట్’ చిత్రాలు కూడా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజయ్యాయి. అలాగే మలయాళ క్రైమ్ థ్రిల్లర్ ‘ప్రావింకూడు షప్పు’ సోనీ లివ్‌లో విడుదలైంది.

Similar News

News March 23, 2026

IPL: SRHకు గుడ్‌న్యూస్

image

ఐపీఎల్ ప్రారంభానికి ఐదు రోజుల ముందు SRHకి గుడ్‌న్యూస్ అందింది. ఆ జట్టు పేసర్ ఎషాన్ మలింగాకు శ్రీలంక క్రికెట్ బోర్డు క్లియరెన్స్ ఇచ్చింది. దీంతో ఆయన త్వరలోనే జట్టులో చేరనున్నారు. ఆయన రాకతో జట్టు బౌలింగ్ స్ట్రాంగ్ కానుంది. ఇక LSG ఆల్‌రౌండర్ హసరంగా, KKR ఫాస్ట్ బౌలర్ మతీశ పతిరణకు ఇంకా ఫిట్‌నెస్ టెస్ట్ కాలేదని CricBuzz తెలిపింది. అటు RCB పేసర్ నువాన్ తుషారాపై ఇంకా ఎలాంటి అప్‌డేట్ రాలేదని పేర్కొంది.

News March 23, 2026

రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

image

TG: సీఎం రేవంత్ రెడ్డి రేపు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ నివాసంలో జరగనున్న ప్రైవేట్ వేడుకకు ఆయన హాజరుకానున్నారు. అనంతరం AICC అగ్రనేతలతోనూ సీఎం భేటీ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ నిధులు, విభజన హామీలపై కేంద్ర మంత్రులనూ కలవనున్నట్లు తెలుస్తోంది. రేపు రాత్రికి ఢిల్లీలోనే బస చేసి, ఎల్లుండి తిరిగి హైదరాబాద్‌కు చేరుకోనున్నారు.

News March 23, 2026

దృశ్యం-3 రిలీజ్ వాయిదా

image

మలయాళ నటుడు మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న దృశ్యం-3 సినిమా విడుదల వాయిదా పడింది. తన పుట్టిన రోజైన మే 21న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మోహన్‌లాల్ ఇన్‌స్టాలో వెల్లడించారు. ఈ మూవీని ఏప్రిల్ 2న రిలీజ్ చేస్తామని గతంలో మేకర్స్ ప్రకటించారు. జీతూ జోసెఫ్ తెరకెక్కించిన దృశ్యం 1, 2 చిత్రాలు సూపర్ హిట్ కాగా, వాటికి కొనసాగింపుగా మూడో భాగం వస్తోంది.