News April 11, 2025
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఆహ్వానించండి : తుమ్మల

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఆహ్వానించాలని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్ అభివృద్ధి చేయాలని, ఫుడ్ ప్రాసెసింగ్‌తో పంట విలువ పెరుగుతుందన్నారు. భవిష్యత్ అంతా ఫుడ్ ప్రాసెసింగ్ రంగానిదే అన్నారు. రైతులకు చేయూతనందించాలని, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలోకి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఆహ్వానించాలని కోరారు.
Similar News
News March 5, 2026
రేపు ఖమ్మంలో జాబ్ మేళా

ఖమ్మం నగరంలోని టేకులపల్లి ప్రభుత్వ ఐటీఐ, మోడల్ కెరీర్ సెంటర్ వేదికగా శుక్రవారం ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారిణి మాధవి తెలిపారు. ప్రైవేట్ రంగంలో 322 ఖాళీల భర్తీకి ఈ ప్రక్రియ చేపట్టారు. ఫార్మసిస్ట్, సీఎస్‌ఏ, జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు అర్హులు ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు. ఎంపికైన వారికి హైదరాబాద్‌లో ఉద్యోగంతో పాటు ఉచిత వసతి కల్పిస్తామని వెల్లడించారు.
News March 4, 2026
సీఎంఆర్ బియ్యం సేకరణలో జాప్యం వద్దు: అదనపు కలెక్టర్

మిల్లింగ్ చేసిన సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) బియ్యాన్ని గోదాములకు చేరవేయడంలో ఎలాంటి ఆలస్యం జరగకూడదని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో గోడౌన్ మేనేజర్లు, ఎంఎల్‌ఎస్ పాయింట్ ఇన్‌చార్జులతో ఆయన సమీక్ష నిర్వహించారు. మిల్లర్లు బియ్యం తీసుకొచ్చినప్పుడు సకాలంలో లోడింగ్, అన్ లోడింగ్ చేసేలా హమాలీలను సిద్ధంగా ఉంచాలన్నారు.
News March 4, 2026
ఖమ్మం జిల్లాలో నయా మోసం

ఖమ్మం జిల్లాలో నకిలీ మొక్కల ముఠా కలకలం సృష్టిస్తోంది. కేరళ నుంచి నాణ్యమైన మామిడి మొక్కలు తెస్తామంటూ నకిలీ బిల్లులతో రైతులను నమ్మిస్తున్నారు. ఒక్కో మొక్కకు రూ.370 నిర్ణయించి, అడ్వాన్సులు వసూలు చేసి ఉడాయిస్తున్నారు. తిరుమలాయపాలెం మండలం పాతర్లపాడుకు చెందిన రైతు నుంచి రూ.23 వేలు కాజేశారు. అపరిచిత వ్యక్తులకు ఫోన్ పే, జీపే చేయవద్దని, నకిలీ నర్సరీల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.


