News April 11, 2025
CSK కెప్టెన్‌గా ధోనీ.. 2022 సీన్ రిపీట్?

CSK కెప్టెన్‌గా తిరిగి ధోనీని నియమించడంపై కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వరుస ఓటముల వల్ల ఉద్దేశపూర్వకంగానే యాజమాన్యం ఇలా చేస్తోందని అంటున్నారు. తాజాగా గాయం కారణంతో రుతురాజ్ నుంచి కెప్టెన్సీ బాధ్యతలను ధోనీకి అప్పగించిన CSK 2022లోనూ జడేజాను కెప్టెన్సీ నుంచి తప్పించిందని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు గైక్వాడ్ కెప్టెన్సీలో 5 మ్యాచుల్లో 4 ఓడగా.. అప్పుడు జడేజా కెప్టెన్సీలో 8 మ్యాచుల్లో 6 ఓడింది.
Similar News
News April 19, 2025
అప్పుడూ.. ఇప్పుడూ ఒకే స్కోరు, ఒకే రిజల్ట్

చిన్నస్వామి స్టేడియంలో పంజాబ్‌తో మ్యాచులో RCB ఓడిన విషయం తెలిసిందే. అయితే, ఈ మ్యాచులో జరిగిన పలు యాదృచ్ఛిక సంఘటనలను అభిమానులు గుర్తుచేసుకుంటున్నారు. 18 ఏళ్ల క్రితం ఐపీఎల్ తొలి సీజన్ ఫస్ట్ మ్యాచులో KKRపై ఆర్సీబీ 9 ఓవర్లలో 43/7 స్కోర్ చేయగలిగింది. నిన్నటి మ్యాచులోనూ RCB 9 ఓవర్లలో 43/7 స్కోర్ చేసింది. అటు కోహ్లీ కూడా అప్పుడు, ఇప్పుడు ఒకే రన్ చేయగా, RCB రెండు సార్లూ ఓడిపోయింది.
News April 19, 2025
నేటి నుంచి 10 రోజులు..

తెలంగాణలో రాబోయే పది రోజులు ఎండలు మండిపోతాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఏప్రిల్ 30 వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు నమోదు అవుతాయని హెచ్చరించారు. హైదరాబాద్ నగరంలో 40-42 డిగ్రీల టెంపరేచర్ రికార్డయ్యే అవకాశం ఉందన్నారు. అదే సమయంలో అకాల వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.
News April 19, 2025
విజయసాయికి వైవీ సుబ్బారెడ్డి కౌంటర్

AP: వైసీపీ కోటరీ వేధింపులు భరించలేకే తాను పార్టీ నుంచి బయటకు వచ్చానన్న విజయసాయి రెడ్డి వ్యాఖ్యలకు వైవీ సుబ్బారెడ్డి కౌంటర్ ఇచ్చారు. ‘పార్టీ నుంచి వెళ్లిపోయాక అభాండాలు వేస్తున్నారు. కోటరీ ఉందా లేదా అనేది అధికారంలో ఉన్నప్పుడు తెలియదా? కోటరీని ఎవరు నడిపారో ఆయనకు తెలియదా? మా పార్టీలో ఒకటి నుంచి వంద వరకు జగనే’ అని స్పష్టం చేశారు. తమ హయాంలో ఎలాంటి లిక్కర్ స్కామ్ జరగలేదని తేల్చి చెప్పారు.