News April 11, 2025

కామారెడ్డి: వేసవి వచ్చేసింది.. జాగ్రత్త!

image

వేసవి వచ్చేసింది. దీంతో ఉక్కబోత పెరిగింది. అయితే సాధారణంగా గ్రామాలు, పట్టణాల్లో ఉక్కబోత కారణంగా బయట పడుకుంటుంటారు. అదే అదనుగా చేసుకుని దొంగలు దొంగతనాలకు పాల్పడే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు. బంగారు ఆభరణాలు, ఫోన్లు దొంగిలించే అవకాశముందని చెబుతున్నారు. సెలవుల్లో ఊర్లకు వెళ్తే ఇంటికి తాళాలు వేసి స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని, చిన్నారులను ఈతకు వెళ్లకుండా చూడాలని సూచిస్తున్నారు.

Similar News

News November 3, 2025

VKB: తండ్రికి టాటా చెప్పి.. మృత్యువు ఒడికి

image

చేవెళ్లలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తాండూరు మండలంలోని ఓ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచింది. గౌతాపూర్ గ్రామానికి చెందిన చాంద్ పాషా కూతురు ముస్కాన్ (21) హైదరాబాద్ కోఠి ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ చదువుతోంది. ఆదివారం సెలవులో ఇంటికి వచ్చిన ఆమె, సోమవారం ఉదయం తాండూరు ఆర్టీసీ బస్సులో హైదరాబాద్‌కు బయల్దేరింది. బస్సు ఎక్కించే తండ్రికి “టాటా” చెప్పి వెళ్లిన ముస్కాన్ ప్రమాదంలో దుర్మరణం చెందింది.

News November 3, 2025

APలో రూ.20వేల కోట్ల పెట్టుబడులు: హిందూజా గ్రూప్

image

AP: రాష్ట్రంలో రూ.20 వేల కోట్ల పెట్టుబడికి హిందూజా గ్రూప్ నిర్ణయం తీసుకుంది. లండన్ పర్యటనలో ఉన్న CM చంద్రబాబు ఆ కంపెనీ ప్రతినిధులతో భేటీ కాగా పెట్టుబడులకు ముందుకొచ్చారు. విశాఖలో హిందూజా పవర్ ప్లాంట్ సామర్థ్యాన్ని మరో 1,600MW పెంచేందుకు, రాయలసీమలో సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి యూనిట్‌ల ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ల నెట్వర్క్ ఏర్పాటుపై MOU పూర్తైంది.

News November 3, 2025

కాకినాడ: జిల్లా అధికారులకు పవన్ కళ్యాణ్ ఆదేశాలు

image

కాశీబుగ్గ సంఘటన నేపథ్యంలో కాకినాడ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన అన్నవరం, పిఠాపురం, సామర్లకోటలలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించారు. సోమవారం ఫోన్‌లో మాట్లాడిన ఆయన, కాశీబుగ్గ తొక్కిసలాట దృష్ట్యా మరింత జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆలయాలపై నిరంతరం పర్యవేక్షణ చేయాలని, ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.