News April 11, 2025
ఎన్టీఆర్: బీటెక్ పరీక్షల టైమ్ టేబుల్ విడుదల

కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలో బీటెక్ చదివే విద్యార్థులు రాయాల్సిన 4, 6వ సెమిస్టర్ థియరీ(రెగ్యులర్ &సప్లిమెంటరీ) పరీక్షల టైమ్ టేబుల్ విడుదలైంది. ఏప్రిల్ 26 నుంచి మే 7 మధ్య నిర్ణీత తేదీలలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని KRU వర్గాలు తెలిపాయి. సబ్జెక్ట్ వారీగా టైమ్ టేబుల్ పూర్తి వివరాలకు https://kru.ac.in/ వెబ్‌సైట్ చూడాలని కోరాయి.
Similar News
News April 15, 2026
విశాఖలో దారుణం.. కూలీని కొట్టి చంపిన తోటి కూలీలు

మధురవాడలోని బక్కన్నపాలెం సమీపంలోని ఓ లేబర్ క్యాంప్‌లో యువకుడు హత్యకు గురయ్యాడు. పీఎంపాలెం CI బాలకృష్ణ తెలిపిన వివరాలు ప్రకారం.. ఝార్ఖండ్‌కు చెందిన సికింధర్(19)కు తోటి కూలీలైన శ్యామ్, నజురుల్‌లతో మంగళవారం వివాదం జరిగింది. దీంతో వారు విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్ర గాయాలైన సికింధర్ అక్కడికక్కడే మృతి చెందాడు.నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం KGHకి తరలించారు.
News April 15, 2026
మరింత పెరగనున్న వాహనాల ధరలు?

నిర్వహణ ఖర్చులు పెరిగాయంటూ ఇప్పటికే ఆటోమొబైల్ కంపెనీలు వాహనాల ధరలు పెంచుతున్నాయి. యుద్ధం మరింత కాలం కొనసాగితే ఉత్పత్తి వ్యయం పరిమితికి మించి పెరిగి రేట్లు మరింత పెంచాల్సి రావొచ్చని భారత వాహన తయారీదారుల సమాఖ్య(సియామ్) అధ్యక్షుడు శైలేశ్ చంద్ర తెలిపారు. కమోడిటీ ధరలు ఏమేర పెరుగుతాయనేది 4-5 వారాల్లో స్పష్టత రావొచ్చన్నారు. ఆ తర్వాతే వాహనాల రేట్ల పెంపుపై నిర్ణయం తీసుకోవడానికి వీలవుతుందని వెల్లడించారు.
News April 15, 2026
తాడిపత్రిలో కీచక అధికారి

తాడిపత్రి మున్సిపాలిటీలో ఓ కీలక అధికారి మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులకు పాల్పడుతుండటం కలకలం రేపుతోంది. సచివాలయ, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగినులను లక్ష్యంగా చేసుకొని అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. బాధితుల కుటుంబ సభ్యులు సదరు అధికారికి దేహశుద్ధి చేసినా తీరు మారలేదట. ఆ కీచక అధికారి వ్యవహారాలు బయటకు రాకుండా అధికార పార్టీ నేతలు జోక్యం చేసుకొని తొక్కిపెడుతున్నారని బాధితులు వాపోతున్నారు.


