News April 11, 2025

వనపర్తి జిల్లా RAIN UPDATES

image

వనపర్తి జిల్లా కేంద్రంలో స్వల్ప వర్షపాతం నమోదైంది. గోపాల్‌పేట్ 9.8 మి.మీ, శ్రీరంగాపురం 9.5 మి.మీ, రేవల్లి 9.3 మి.మీ, వనపర్తి 4.5, జానంపేట 3.3, కేతేపల్లి 3.0, పానగల్ 2.5, రేమద్దుల 2.0, పెబ్బేరు 1.8, సోలీపూర్ 1.3, మదనాపూర్ 1.0, వీపనగండ్ల 0.5, పెద్దమందడి, ఘనపూర్, ఆత్మకూరు, అమరచింత, కానాయిపల్లి, అమరచింత, అఙ్గమకూర్, దగడా 0.00 మి.మీగా నమోదయ్యాయి.

Similar News

News July 5, 2025

బాధ్యతలు స్వీకరించిన రామ్‌చందర్ రావు

image

TG: బీజేపీ రాష్ట్రాధ్యక్షుడిగా రామ్‌చందర్ రావు బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లోని బీజేపీ ఆఫీస్‌లో కిషన్ రెడ్డి నుంచి ఆయన బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా రామ్‌చందర్ రావును పలువురు నేతలు, నాయకులు సన్మానించి, శుభాకాంక్షలు తెలియజేశారు.

News July 5, 2025

వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులు

image

APలో స్మార్ట్ కార్డుల రూపంలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. QR కోడ్‌తో వివరాలు ప్రత్యక్షమయ్యేలా పాత కార్డుల స్థానంలో కొత్తవి ఆగస్టులో పంపిణీ చేయనుంది. నేతల ఫొటోలు లేకుండా, ప్రభుత్వ అధికారిక చిహ్నం, లబ్ధిదారు ఫొటో మాత్రమే ఉండేలా చర్యలు తీసుకుంటోంది. 1.46 కోట్ల పాత కార్డులతో పాటు కొత్తగా 2 లక్షల కొత్త రేషన్‌కార్డుదారులకు వచ్చే నెలలో వీటిని జారీ చేయనుంది.

News July 5, 2025

ఎన్టీఆర్: నకిలీ సర్టిఫికెట్ల కలకలం

image

ఎన్టీఆర్ జిల్లాకు చెందిన పలువురు ఏఎన్‌ఎంలు ప్రమోషన్ల కోసం నకిలీ క్లినికల్ టెస్టింగ్ సర్టిఫికెట్లు సమర్పించారు. నరసరావుపేటలోని ఓ కాలేజీలో ఇంటర్న్‌షిప్ చేయకుండానే వీటిని పొందినట్లు వైద్యశాఖ గుర్తించింది. ఈ ఘటనపై కృష్ణా జిల్లా డీఎంహెచ్‌ఓ శర్మిష్ఠ ఏఎన్‌ఎంలకు నోటీసులు జారీ చేశారు. సదరు కాలేజీని సంప్రదించగా, ఈ సర్టిఫికెట్లు నకిలీవని తేలిందన్నారు.