News April 11, 2025

గద్వాల: పెళ్లి వేడుకలో ఘర్షణ

image

గద్వాల పట్టణంలోని గజ్జెలమ్మ వీధి గోకరమయ్య కట్ట వద్ద రాత్రి పెళ్లి వేడుకలో డీజే పాటల కోసం 2 వర్గాలు కట్టెలు, రాళ్లతో దాడి చేసుకున్నాయని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారని చెప్పారు. పది మందిని అదుపులోకి తీసుకుని, మరికొందరిపై కేసులు నమోదు చేసినట్లు పట్టణ ఎస్ఐ కళ్యాణ్ కుమార్ తెలిపారు.

Similar News

News January 5, 2026

మహబూబ్‌నగర్: పేదలకు వరం ‘గృహజ్యోతి’

image

నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అమలు చేస్తున్న ‘గృహజ్యోతి’ పథకం వారికి ఒక వరమని మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ పెద్ద విజయ్ కుమార్ ముదిరాజ్ పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా లక్షలాది కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నాయని, ప్రభుత్వం ఇప్పటివరకు సుమారు రూ.3,593 కోట్ల మేర విద్యుత్ బకాయిలను చెల్లించిందని తెలిపారు. గతంలో దరఖాస్తు చేసుకోని వారు ఇప్పుడు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.

News January 5, 2026

MBNR: 87126 59360.. SAVE చేసుకోండి

image

జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట బందోబస్తుతో పాటు రాత్రి వేళల్లో గస్తీ ముమ్మరం చేసినట్లు ఎస్పీ డి.జానకి తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని, ఏదైనా అనుమానాస్పద సమాచారం ఉంటే వెంటనే ‘డయల్ 100/112’ లేదా జిల్లా పోలీసు కంట్రోల్ రూమ్ నంబరు 87126 59360కు సమాచారం అందించాలని ఆమె కోరారు.

News January 5, 2026

మహబూబ్‌నగర్‌లో భూ ప్రకంపనల కలకలం..?

image

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు సమీప కాలనీల్లో సోమవారం సాయంత్రం స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఒక్కసారిగా కిటికీలు, సామాన్లు కదలడంతో జనం భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే సమీపంలో భారీ పేలుడు శబ్దం వినిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇది భూకంపమా లేక బ్లాస్టింగ్ వల్ల జరిగిందా అన్నది తెలియాల్సి ఉంది.