News April 11, 2025

గద్వాల: పెళ్లి వేడుకలో ఘర్షణ

image

గద్వాల పట్టణంలోని గజ్జెలమ్మ వీధి గోకరమయ్య కట్ట వద్ద రాత్రి పెళ్లి వేడుకలో డీజే పాటల కోసం 2 వర్గాలు కట్టెలు, రాళ్లతో దాడి చేసుకున్నాయని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారని చెప్పారు. పది మందిని అదుపులోకి తీసుకుని, మరికొందరిపై కేసులు నమోదు చేసినట్లు పట్టణ ఎస్ఐ కళ్యాణ్ కుమార్ తెలిపారు.

Similar News

News April 19, 2026

పవన్‌ కళ్యాణ్‌కు జరిగిన సర్జరీ ఇదేనా?

image

AP Dy.CM పవన్ కళ్యాణ్‌ ముక్కుకు హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో శస్త్రచికిత్స జరిగినట్లు తెలుస్తోంది. కొన్నాళ్లుగా ఉన్న సైనసైటిస్ కారణంగా నిన్న ఊపిరి తీసుకోవడంలో ఎక్కువగా ఇబ్బంది కలగడంతో ఆయన వైద్యులను సంప్రదించారు. సర్జరీ అవసరమని డాక్టర్లు నిర్ధారించి ముక్కుకు ఆపరేషన్ చేసి శ్వాస ఇబ్బందిని తొలగించినట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. సర్జరీ అనంతరం పవన్ ఇంటికి వెళ్లిపోయారని చెబుతున్నాయి.

News April 19, 2026

ఉండవెల్లి: అన్నపై గొడ్డలితో తమ్ముడు దాడి..!

image

ఉండవెల్లి మండలంలో ప్రగటూరులో రక్తసంబంధం మంటగలిసింది. చిన్నపాటి వివాదాలు కాస్తా హత్యాయత్నానికి దారితీశాయి. శనివారం అన్నదమ్ముల మధ్య పాత గోడ కూల్చివేత విషయంలో జరిగిన గొడవలో తమ్ముడు శేఖర్ తన అన్న మల్లేష్‌పై గొడ్డలితో దాడి చేశాడు. దాడిలో మల్లేష్ చేతికి తీవ్ర గాయమవ్వగా ఉండవెల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై శేఖర్ తెలిపారు.

News April 19, 2026

IPLలో నేడు హోరాహోరీ పోరు

image

IPLలో నేడు క్రికెట్ ఫ్యాన్స్‌కు డబుల్ వినోదం పంచేందుకు 2 ఆసక్తికరమైన మ్యాచ్‌లు సిద్ధమయ్యాయి. మొదటి మ్యాచ్‌లో KKR, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. ఈరోజు ఓడిపోతే KKR దాదాపు ఇంటిబాట పట్టినట్లే. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు కోల్‌కతా వేదికగా ప్రారంభమవుతుంది. ఇక రెండో మ్యాచ్‌లో PBKS, LSG జట్లు ఢీకొంటాయి. చండీగఢ్ వేదికగా 7:30Pmకు ఈ పోరు మొదలవుతుంది. పాయింట్ల పట్టికలో PBKS ఫస్ట్ ప్లేస్‌లో ఉంది.