News April 11, 2025
HYD: ప్రభుత్వానికి 3D మంత్ర: KTR

కాంగ్రెస్ ప్రభుత్వం 3D మంత్ర అమలు చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ.. డిస్ట్రక్షన్, డిమాల్షన్, డైవర్షన్ కాంగ్రెస్ ప్రభుత్వ విధానమని, 400 ఎకరాలు అటవీ భూమే అని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పుల ఆధారంగా ఆ 400 ఎకరాలు అటవీ భూమి అని చెబుతున్నానన్నారు.
Similar News
News September 18, 2025
విజయవాడ: దసరాకు 422 ప్రత్యేక బస్సులు

దసరా, విజయవాడ ఉత్సవాల సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విజయవాడ నుంచి వివిధ ప్రాంతాలకు 422 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని 12 డిపోల నుంచి ఈ బస్సులు అందుబాటులో ఉంటాయని చెప్పారు. రద్దీకి అనుగుణంగా ప్రతి రోజు ఈ ప్రత్యేక సర్వీసులను నడుపుతామని పేర్కొన్నారు.
News September 18, 2025
KNR: నేటి నుంచి సదరం క్యాంపులు

కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ఆధ్వర్యంలో నేటి నుంచి 24వ తేదీ వరకు సదరం క్యాంపులు జరగనున్నాయని జిల్లా ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన దివ్యాంగులు మీసేవ కేంద్రాల ద్వారా తమ పేరును నమోదు చేసుకొని, కేటాయించిన తేదీల్లో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో హాజరుకావాలని కోరారు. మొత్తం 676 మందికి ఈ క్యాంపుల్లో పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటనలో పేర్కొన్నారు.
News September 18, 2025
సాహిత్య పురస్కారాలకు ముగ్గురు కవులు ఎంపిక

ఉమ్మడి జిల్లాకు చెందిన ముగ్గురు కవులు సాహిత్య పురస్కారాలకు ఎంపిక య్యారు. NKP మండలానికి చెందిన సాగి కమలాకరశర్మ ఇటీవల దివాకర్ల వేంకటావధాని సాహిత్య పురస్కారానికి ఎంపిక కాగా.. నల్గొండకు చెందిన ఎస్. రఘు, సూర్యాపేట జిల్లా అనంతారం గ్రామానికి చెందిన బైరెడ్డి కృష్ణారెడ్డి తెలుగు యూనివర్సిటీ కీర్తి పురస్కారాలకు ఎంపికయ్యారు. వీరి ఎంపిక పట్ల సాహిత్యకారులు హర్షం వ్యక్తం చేశారు.