News April 11, 2025
అన్నమయ్య జిల్లా విద్యార్థుల ఎదురుచూపు

అన్నమయ్య జిల్లాలో ఇంటర్ పరీక్షలు ఇటీవల పూర్తయిన విషయం తెలిసిందే. మొత్తం 28,602 మంది పరీక్షలు రాశారు. ఇందులో మొదటి సంవత్సర విద్యార్థులు 14,855 మంది కాగా, సెకండియర్ విద్యార్థులు 13,747 మంది ఉన్నారు. వీరి భవితవ్యం శనివారం తేలనుంది. దీంతో విద్యార్థులు ఎదురుచూస్తున్నారు.
☞ వే2న్యూస్ యాప్‌లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
Similar News
News January 13, 2026
కోడిపందేలపై ఫిర్యాదుకు కంట్రోల్ రూమ్!

హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లాలో కోడిపందేల నియంత్రణకు కాకినాడ కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు ఇన్‌ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్ మంగళవారం తెలిపారు. ఈ నెల 13 నుంచి 18 వరకు 0884-2356801 నంబర్ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. పందేలపై వచ్చే ఫిర్యాదులపై తక్షణమే తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.
News January 13, 2026
తిరుమలలో ఎల్లుండి నుంచి సుప్రభాత సేవ

తిరుమల శ్రీవారి ఆలయంలో నెల రోజుల పాటు సాగిన ధనుర్మాస తిరుప్పావై పాశురాల పారాయణం బుధవారంతో ముగియనుంది. డిసెంబర్ 17వ తేదీ నుంచి శ్రీవారికి బిల్వ పత్రాలతో సహస్రనామార్చన, శ్రీవల్లి పుత్తూరు చిలుకలు అలంకరించి పూజలు చేస్తున్నారు. ఈనెల 15వ తేదీ నుంచి యథావిధిగా వేకువజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొపుతారు.
News January 13, 2026
‘మన శంకరవరప్రసాద్ గారు’.. చిరంజీవి రెమ్యునరేషన్ ఎంతంటే?

‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి రూ.70 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు టాలీవుడ్ టాక్. ఈ మూవీకి చిరు కూతురు సుష్మిత కో-ప్రొడ్యూసర్‌గా ఉన్న విషయం తెలిసిందే. కాగా 1992లో ఆపద్బాంధవుడు సినిమాకు రూ.కోటితో దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకున్న నటుడిగా మెగాస్టార్ రికార్డు సృష్టించారు. ఆచార్య, వాల్తేరు వీరయ్య సినిమాలకు రూ.50 కోట్లు, భోళా శంకర్‌కు రూ.63 కోట్లు తీసుకున్నట్లు సమాచారం.


