News April 11, 2025
రేపే రిజల్ట్.. సత్యసాయి జిల్లా విద్యార్థుల్లో ఉత్కంఠ!

ఇంటర్ ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లాలో ఫస్టియర్ 13,083, సెకండియర్ 10,904 మంది ఇంటర్ విద్యార్థులు ఉన్నారు. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.
☞ వే2న్యూస్ యాప్‌లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
Similar News
News December 29, 2025
తిరుమల: 365 రోజులు.. 450 ఉత్సవాలు

ఏడాదికి 365 రోజులే. కానీ కోరిన కోర్కెలు తీర్చే తిరుమల కోనేటి రాయుడికి ఏడాదిలో 450పైగా ఉత్సవాలు జరుగుతాయి. సుప్రభాతం, తోమాల, సహస్రనామార్చన, అష్టదళ పాదపద్మారాధన, తిరుప్పావడ, పూలంగి, శుక్రవారాభిషేకం, రోహిణి, ఆరుద్ర, పునర్వసు, శ్రవణం నక్షత్రోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, పద్మావతి పరిణయం తదితర ఉత్సవాలు చేస్తారు. ఇలా రోజూ ఒక పండగగా నిత్య కళ్యాణం పచ్చ తోరణంలా తిరుమల విరాజిల్లుతోంది.
News December 29, 2025
ఒక్క కాఫీతో కపుల్స్ గొడవలకు ఫుల్‌స్టాప్!

దంపతుల మధ్య చిన్న చిన్న గొడవలు సహజం. గిల్లికజ్జాలు లేకపోతే ఆ సంసారంలో మజా ఉండదు అంటారు. అయితే ఒక్కోసారి మాటామాటా పెరిగి ఈగోకి పోతుంటారు. అది అస్సలు మంచిది కాదని ఫ్యామిలీ కౌన్సిలర్లు హెచ్చరిస్తున్నారు. ‘ఎలాంటి గొడవైనా మాట్లాడుకుని సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సాయంత్రం ఒక మంచి కాఫీ పెట్టుకుని ఇద్దరూ కూర్చొని మనసు విప్పి మాట్లాడుకుంటే ఏ గొడవైనా ఇట్టే సాల్వ్ అవుతుంది’ అని సూచిస్తున్నారు.
News December 29, 2025
విజయ్ హజారేలో హైదరాబాద్ బే‘జారే’!

విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ మూడో సారి ఓటమి పాలైంది. సోమవారం జరిగిన గ్రూప్-B మ్యాచ్‌లో అస్సాం 4 వికెట్ల తేడాతో HYDను ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 310 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో అస్సాంలో శిబ్‌శంకర్ రాయ్ (112) మెరుపు సెంచరీ చేశాడు. సౌరవ్ (91) పరుగులతో రాణించాడు. దీంతో లక్ష్యాన్ని ASM 49.3 ఓవర్లలో సాధించి విజేతగా నిలిచింది.


