News April 11, 2025

తూ.గో: 43వేల మంది విద్యార్థుల ఎదురుచూపు

image

తూ.గో. జిల్లాలో ఇంటర్ పరీక్షలు ఇటీవల పూర్తయిన విషయం తెలిసిందే. మొత్తం 51 పరీక్షా కేంద్రాల్లో 43,754 మంది పరీక్షలు రాశారు. ఇందులో మొదటి సంవత్సరం విద్యార్థులు 22,817 మంది కాగా, సెకండియర్ విద్యార్థులు 20,937 మంది ఉన్నారు. వీరి భవితవ్యం శనివారం తేలనుంది.
☞ వే2న్యూస్ యాప్‌లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

Similar News

News April 19, 2025

పేరుపాలెం బీచ్‌లో గల్లంతైన యువకుడి మృతి

image

పేరుపాలెం బీచ్‌లో స్నానం చేస్తూ ఇద్దరు యువకులు గల్లంతైన విషయం తెలిసిందే. గుడ్ ఫ్రైడే పురస్కరించుకుని నల్లజర్ల మండలం ప్రకాశరావు పాలెంకు చెందిన సంకెళ్ల ఉదయ్ కిరణ్ (20) స్నానానికి వచ్చాడు. అలల ఉద్ధృతికి కొట్టుకుపోయి మృతి చెందాడు. మృతదేహాన్ని నరసాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మరో యువకుడు భీమవరం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

News April 19, 2025

ప్రవీణ్ శరీరంపై 18 గాయాలున్నాయి: హర్షకుమార్

image

పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసులో పోస్టుమార్టం రిపోర్టు బహిర్గతం చేయడానికి ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తోందని మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్ నిలదీశారు.శుక్రవారం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రవీణ్ కేసులో పోలీసుల దర్యాప్తును తనతో సహా ఎవ్వరూ విశ్వసించడం లేదని వ్యాఖ్యానించారు. తన వద్దకు వచ్చిన పోస్టుమార్టం రిపోర్ట్ ప్రకారం ప్రవీణ్‌పై 18 శరీరంపై గాయాలున్నాయని, ఇది ముమ్మాటికీ హత్యే అని పేర్కొన్నారు.

News April 18, 2025

తూ.గో. జిల్లా ప్రజలకు హెచ్చరిక

image

తూర్పు గోదావరి జిల్లా ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నేడు జిల్లాలో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని APSDMA సూచించింది. చెట్ల కింద ఎవరూ ఉండవద్దని హెచ్చరించింది.

error: Content is protected !!