News April 11, 2025
రేపే రిజల్ట్.. అంబేడ్కర్ కోనసీమ జిల్లా విద్యార్థుల ఎదురుచూపు

అంబేడ్కర్ కోనసీమలో ఇటీవల Inter పరీక్షలు పూర్తయ్యాయి. రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు నేడు విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. రేపు ఫలితాలను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో విద్యార్థుల్లో టెన్షన్ నెలకొంది. అయితే మొత్తం 40పరీక్షా కేంద్రాల్లో 27,312 మంది పరీక్షలు రాశారు. ఫస్టియర్ 13,431 మంది విద్యార్థులు, సెకండియర్ 13,881 మంది ఉన్నారు.
☞ వే2న్యూస్ యాప్‌లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
Similar News
News March 24, 2026
యువతా.. దేశ రాజకీయం మార్చేందుకు సిద్ధమా?

రాజకీయాలపై ఆసక్తి ఉన్న యువత, మహిళలకు గోల్డెన్ ఛాన్స్. నియోజకవర్గాల పునర్విభజనతో దేశవ్యాప్తంగా లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు <<19460921>>భారీగా<<>> పెరగనున్నాయి. దీంతో విస్తృత అవకాశాలు రానున్నాయి. దేశ దిశను మార్చాలనే సంకల్పం ఉన్నవారు ప్రజాక్షేత్రంలోకి దిగండి. కొత్త ఆలోచనలు, సరికొత్త భావజాలాలను ప్రజలకు పరిచయం చేసి వారి మెప్పు పొందండి. ‘నేపాల్’ను గెలిచిన Gen Z స్ఫూర్తితో ముందుకు కదలండి.
News March 24, 2026
విజయవాడలో ఉగ్రమూలాలు.. ముగ్గురు అరెస్ట్

AP: ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో విజయవాడలో ముగ్గురు వ్యక్తులు పట్టుబడ్డారు. మొహ్మద్ రహమతుల్లా షరీఫ్, మీర్జా సొహైల్ బేగ్, మొహ్మద్ డానిష్ అనే ఈ నిందితులు సోషల్ మీడియా ద్వారా యువతను తీవ్రవాద భావజాలంవైపు ఆకర్షిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరితో పాటు పది మంది దేశవ్యాప్తంగా ఈ నెట్‌వర్క్ నడిపిస్తున్నారని.. వీరికి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
News March 24, 2026
సిరిసిల్ల: తగినంత గ్యాస్ నిల్వలు ఉన్నాయి.. ఆందోళన వద్దు!

జిల్లాలో గ్యాస్ నిల్వలు తగినంత ఉన్నాయని జిల్లా పౌర సరఫరాల అధికారి బుచ్చిబాబు తెలిపారు. ఈ మేరకు సిరిసిల్ల కలెక్టరేట్ నుంచి మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. వినియోగదారులు గ్యాస్ బుకింగ్ చేసిన 25 రోజులు, అలాగే రూరల్ పరిధిలో 45 రోజులలోపు గ్యాస్ సిలిండర్లు డెలివరీ అవుతాయన్నారు. వినియోగదారులు ఆందోళన చెందవద్దని ఆయన సూచించారు.


