News April 11, 2025
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కడియం

చిల్పూర్ మండలం మల్కాపూర్ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులకు మద్దతు ధర అందించాలని, మహిళా సంఘాలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News April 19, 2025
విశాఖ కొత్త మేయర్ ఆయనేనా?

జీవీఎంసీ మేయర్‌పై అవిశ్వాస తీర్మానంలో కూటమి నెగ్గడంతో కొత్త మేయర్ ఎవరన్న సందిగ్ధంలో కార్పొరేటర్లు ఉన్నారు. కూటమిలో పలువురు ఆశావాహులు మేయర్ పదవిని ఆశిస్తున్నట్లు సమాచారం. అయితే టీడీపీ ఫ్లోర్ లీడర్‌గా ఉన్న పీలా శ్రీనివాస్‌కే పదవి దక్కే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. త్వరలోనే డిప్యూటీ మేయర్ పదవికి అవిశ్వాసం జరిగితే ఆ పదవి జనసేనకు కేటాయిస్తారని కూటమి వర్గాల్లో చర్చనడుస్తోంది.
News April 19, 2025
వందేళ్ల వరకు భూ సమస్య లేని విధంగా భూభారతి: కలెక్టర్ గౌతం

వందేళ్ల వరకు భూసమస్యలు లేని విధంగా భూభారతి చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందని కలెక్టర్ గౌతం తెలిపారు. శనివారం కేశవరంలోని సూపర్ సంగీత్ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటుచేసిన భూభారతి చట్టంపై అవగాహన సదస్సులో కలెక్టర్ పాల్గొన్నారు. భూముల సమస్యలలో శాశ్వత పరిష్కారం భూభారతిలో జరుగుతుందన్నారు. అడిషనల్ కలెక్టర్ విజయేందర్ రెడ్డి, ఆర్డీవో ఉపేందర్ రెడ్డి, ఎమ్మార్వో వెంకటనరసింహారెడ్డి పాల్గొన్నారు.
News April 19, 2025
రోడ్లపై చెత్తను ఎత్తిన తిరుపతి SP

చంద్రగిరిలో శనివారం స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పులివర్తి నాని, ఎస్పీ హర్ష వర్ధన్ రాజు పాల్గొన్నారు. రోడ్లపై ఉన్న చెత్తను వారు శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని, అప్పుడే మన పరిసరాలు శుభ్రంగా ఉంటాయని పిలుపునిచ్చారు.