News March 27, 2024

మద్నూర్: ఇంటి తాళాలు పగలగొట్టి బంగారం, నగదు చోరీ

image

ఉమ్మడి జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. తాజాగా మద్నూరులో ఇంటి తాళాలు పగలగొట్టి బంగారం, నగదు ఎత్తుకెళ్లారు. మద్నూరుకు చెందిన మహజన్ బాలాజీ ఈనెల 26న సాయంత్రం ఇంటికి తాళం వేసి మార్కెట్‌లో సరుకులు కొనుగోలు కోసం వెళ్లాడు. తిరిగి రాత్రి 8:45 ప్రాంతంలో ఇంటికి రాగా తాళం పగలగొట్టి ఉంది. బీరువాలోని 25 తులాల బంగారం, రూ.16వేలు ఎత్తుకెళ్లారని బాలాజీ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు SI శ్రీకాంత్ తెలిపారు.

Similar News

News July 7, 2025

NZB: అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా గాంధారి నరసింహారెడ్డి

image

నిజామాబాద్ మొదటి జిల్లా కోర్టు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా గాంధారి నరసింహారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలోని అనంతగిరికి చెందిన నర్సింహారెడ్డి ఇంటర్మీడియట్ విద్యను ఖిల్లా కళాశాలలో, డిగ్రీ, లా ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తి చేశారు. అనంతరం నిజామాబాద్ జిల్లా కోర్టులో సుదీర్ఘకాలం న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు.

News July 7, 2025

NZB: రైలు ఢీకొని మహిళ మృతి

image

రైలు ఢీకొని గుర్తు తెలియని మహిళ మృతి చెందినట్లు నిజామాబాద్ రైల్వే SI సాయిరెడ్డి తెలిపారు. నిజామాబాద్-జానకంపేట్ మధ్య KM.No 456-14 సమీపంలో ఆదివారం ఓ మహిళ పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టినట్లు చెప్పారు. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింనట్లు పేర్కొన్నారు. ఆమె సంబంధించిన వివరాలు తెలిస్తే రైల్వే పోలీసులను సంప్రదించాలన్నారు.

News July 7, 2025

NZB: ఈ నెల 13న ఊర పండుగ

image

ఈ నెల 13న నిజామాబాద్ ఊర పండుగ నిర్వహించనున్నట్లు నగర సర్వ సమాజ్ కమిటీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ తెలిపారు. ఆదివారం నిజామాబాద్‌లోని సిర్నాపల్లి గడిలో పండుగ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఊర పండుగను పురస్కరించుకొని ఖిల్లా చౌరస్తా నుంచి పెద్దబజార్, ఆర్య సమాజ్, గోల్ హనుమాన్ మీదుగా వినాయక్ నగర్ వరకు గ్రామ దేవతల ఊరేగింపు ఉంటుందన్నారు. గురువారం బండారు వేయనున్నట్లు పేర్కొన్నారు.