News April 11, 2025

కాకినాడ జిల్లా విద్యార్థుల ఎదురుచూపు

image

కాకినాడ జిల్లాలో ఇంటర్ పరీక్షలు ఇటీవల పూర్తయిన విషయం తెలిసిందే. మొత్తం 56 పరీక్షా కేంద్రాల్లో 44,531 మంది పరీక్షలు రాశారు. ఇందులో ఫస్టియర్ విద్యార్థులు 22,656 మంది కాగా, సెకండియర్ విద్యార్థులు 21,871 మంది ఉన్నారు. వీరి భవితవ్యం శనివారం తేలనుంది. దీంతో విద్యార్థుల్లో టెన్షన్ నెలకొంది.
☞వే2న్యూస్ యాప్‌లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

Similar News

News July 4, 2025

మెదక్ పోక్సో కోర్టు ప్రత్యేక పీపీగా బాలయ్య నియామకం

image

మెదక్ పోక్సో కోర్టు ప్రత్యేక పీపీగా న్యాయవాది బాలయ్య నియమితులయ్యారు. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా స్పెషల్ పీపీగా నియమితులైన బాలయ్యను మెదక్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో అధ్యక్షులు మర్కంటి రాములు, కార్యదర్శి శిరిగా కరుణాకర్, ఉపాధ్యక్షులు ఆకుల శ్రీనివాస్, లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.

News July 4, 2025

ఏలూరు: బంగారు ఆభరణాలు తస్కరిస్తున్న నలుగురి అరెస్ట్

image

ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకొని బంగారు ఆభరణాలు తస్కరిస్తున్న నలుగురు సభ్యుల ముఠాను కైకలూరు రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 60 గ్రాముల బంగారం, లక్ష రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ శుక్రవారం తెలిపారు. కేసును ఛేదించిన సీఐ రవికుమార్, ఎస్ఐ, ఇతర సిబ్బందిని ఎస్పీ అభినందించి, రివార్డులు అందజేశారు.

News July 4, 2025

GWL: ‘కేంద్రం మార్గదర్శకాలు అమలయ్యేలా చూడాలి’

image

గ్రామాలు పంచాయతీ అడ్వాన్స్‌మెంట్ ఇండెక్స్‌లో అచీవర్స్‌గా నిలవాలనే లక్ష్యంతో కేంద్రం మార్గదర్శకాలు గ్రామాల్లో అమలయ్యే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంతోశ్ సూచించారు. శుక్రవారం ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్లో సంబంధిత అధికారులకు అవగాహన కల్పించారు. గ్రామస్థాయిలో శాఖల వారీగా సమాచారాన్ని సేకరించి పంచాయతీ సెక్రటరీ లాగిన్‌లో నమోదు చేయాలన్నారు. ప్రతి శాఖ నుంచి సమాచారం తీసుకోవాలన్నారు.