News April 11, 2025
నాగర్‌కర్నూల్: సళేశ్వరానికి పోటెత్తిన భక్తులు

నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలంలోని సళేశ్వరం లింగమయ్య జాతరకు భక్తులు పోటెత్తారు. కాలినడకన వచ్చే వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టామని అధికారులు తెలిపారు. గుండె సంబంధిత సమస్యలు ఉన్న వారు విశ్రాంతి తీసుకునేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. లోయలు ఉన్నందున చిన్నపిల్లలను తీసుకొచ్చే వారు జాగ్రత్తగా ఉండాలన్నారు.
Similar News
News January 13, 2026
పేరుకే ప్రజావాణి.. పత్తాలేని అధికారులు!

ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ‘ప్రజావాణి’ కార్యక్రమం ఉద్దేశం నీరుగారుతోంది. నిబంధనల ప్రకారం ప్రజావాణికి 18 శాఖల అధికారులు హాజరుకావాల్సి ఉండగా, కనీస సంఖ్యలో కూడా అధికారులు రాకపోవడం గమనార్హం. సోమవారం నిర్వహించిన ప్రజావాణి ఇందుకు అద్దం పడుతోంది. బీర్కూర్ లో ఇద్దరు అధికారులు పాల్గొనగా, పిట్లంలో ముగ్గురు మాత్రమే దర్శనమిచ్చారు. ఉన్నతాధికారులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
News January 13, 2026
రొయ్యల చెరువులో ఈ మార్పులు కనిపిస్తే..

కొన్నిసార్లు రొయ్యల చెరువులో నీటి నాణ్యత చాలా వేగంగా పడిపోతుంది. రొయ్యలు చెరువు అడుగు భాగంలోనే ఎక్కువ కాలం పాటు ఉంటాయి. ఒకవేళ చెరువు అడుగు భాగం చెడితే రొయ్యల ఆరోగ్యం దెబ్బతింటుంది. చెరువు అడుగు భాగం పాడైనట్లు కొన్ని సంకేతాలతో గుర్తించవచ్చు. కుళ్లిన గుడ్డు వాసన రావడం, రొయ్యలు చెరువు అంచులకు లేదా ఎయిరేటర్ల దగ్గరకు ఎక్కువగా చేరటం, అధిక బురద, రొయ్యలు బలహీనంగా మారటం వంటి లక్షణాలతో గుర్తించవచ్చు.
News January 13, 2026
పాలమూరు: ఉచిత శిక్షణ.. APPLY NOW

MBNR జిల్లా ఎస్సీ స్టడీ సర్కిల్‌లో గ్రూప్స్, బ్యాంకింగ్, ఎస్ఎస్‌సీ, ఆర్ఆర్‌బీ ఉద్యోగాల ఉచిత శిక్షణకు దరఖాస్తులు కోరుతున్నట్లు డైరెక్టర్ కాడం శ్రీనివాస్ తెలిపారు. ఎంపికైన వారికి 5 నెలల పాటు ఉచిత వసతి, భోజనం, పుస్తకాలు, స్టైఫండ్ అందజేస్తారు. ఉమ్మడి జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుద్యోగ డిగ్రీ అభ్యర్థులు tsstudycircle.co.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.


