News March 27, 2024
ఆర్టీసీ ఉద్యోగులకూ పోస్టల్ బ్యాలెట్ సదుపాయం: ఈసీ

AP: పోలింగ్ రోజు విధులు నిర్వహించే ఆర్టీసీ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించాలని జిల్లా కలెక్టర్లకు ఈసీ ఆదేశాలిచ్చింది. అలాగే అత్యవసర సేవల్లో ఉండే 33 శాఖలకు చెందిన ఉద్యోగులకు ఈ సౌకర్యం కల్పించనుంది. రైల్వే, విద్యుత్, ఫైర్, అంబులెన్స్, హెల్త్, పోలీస్, ఫుడ్ కార్పొరేషన్‌తో పాటు తదితర డిపార్ట్‌మెంట్లలో పనిచేసే ఉద్యోగులు, ఈసీ అనుమతి పొందిన మీడియా సంస్థల్లో పనిచేసేవారు ఈ లిస్టులో ఉన్నారు.
Similar News
News January 23, 2026
మామిడిలో ఇనుపధాతు లోప లక్షణాలు – నివారణ

మామిడి చెట్లలో ఇనుపధాతు లోపం వల్ల ఆకులు పచ్చదనం కోల్పోయి తెల్లగా పాలిపోయి ఆకుల సైజు తగ్గిపోతాయి. ఈ తీవ్రత ఎక్కువగా ఉండే మొక్కల ఆకులు పైనుంచి కింద వరకు ఎండిపోతాయి. ఇనుపధాతు లోపం సున్నపురాయి ఉన్న నేలలో సాధారణంగా కనబడుతుంది. ఇనుపధాతు లోపం నివారణకు 2.5 గ్రాముల అన్నభేది+1 గ్రాము నిమ్మ ఉప్పు లేదా ఒక బద్ద నిమ్మకాయ రసం లీటరు నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.
News January 23, 2026
ఎద్దు ఎండకులాగ, దున్న నీడకు లాగ

ఎద్దు ఎంతటి కష్టాన్నైనా ఓర్చుకుని ఎండలో కూడా పని చేస్తుంది. ఇది కష్టపడే తత్వానికి నిదర్శనం. దున్నపోతుకు కాస్త ఎండ తగిలినా భరించలేదు, అది ఎప్పుడూ నీడ కోసం లేదా నీళ్ల కోసం(చల్లదనం కోసం) వెతుకుతుంది. ఇది సుఖాన్ని కోరుకునే తత్వానికి నిదర్శనం. ఒకే ఇంట్లో లేదా ఒకే చోట ఉన్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు ఎంతో కష్టపడే స్వభావం కలిగి ఉంటే, మరొకరు సోమరిగా ఉంటూ సుఖాన్ని కోరుకుంటున్నారని చెప్పడానికి ఈ సామెత వాడతారు.
News January 23, 2026
వసంత పంచమి రోజు పఠించాల్సిన మంత్రాలివే..

చదువుల తల్లి ఆశీస్సుల కోసం ఈరోజు ‘సరస్వతీ ద్వాదశ నామ స్తోత్రం’ పఠించడం అత్యంత ఫలప్రదం. విద్యార్థులు ‘సరస్వతి నమస్తుభ్యం’ శ్లోకాన్ని 108 సార్లు జపించాలి. మేధాశక్తి పెరగడానికి ‘ఓం హ్రీం ఐం సరస్వత్యై నమః’ అనే బీజాక్షర మంత్రాన్ని ధ్యానించాలి. గ్రహ దోషాలు, బుధ గ్రహ దోషం ఉన్నవారు సరస్వతీ కవచం పఠించడం వల్ల వాక్చాతుర్యం లభిస్తుంది. భక్తితో ఈ మంత్రాలను స్మరిస్తే ఏకాగ్రత పెరిగి పరీక్షల్లో విజయం లభిస్తుంది.


