News April 11, 2025
HYD: BRS రజతోత్సవ సభకు రూ.25 లక్షల విరాళం

ఈనెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించే BRS రజతోత్సవ సభకు పార్టీ రంగారెడ్డి జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు పట్నం అవినాశ్ రెడ్డి తన వంతు సహకారాన్ని అందించారు. ఏర్పాట్లకు రూ.25 లక్షల చెక్కును ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ KTRకు అందించారు. ఈ సందర్భంగా కేటీఆర్ అవినాశ్ రెడ్డిని అభినందించారు.
Similar News
News January 12, 2026
HYD: హాస్టళ్లలో నో ఫుడ్!

సంక్రాంతి సెలవులు వస్తే HYDలో ఉండే బ్యాచ్లర్లకు తిండి కష్టాలు వస్తాయని వాపోతున్నారు. DSNR, అమీర్పేట్, హైటెక్స్, KPHB తదితర ఏరియాల్లో ప్రైవేట్ హాస్టళ్ల యాజమాన్యాలు వారం రోజులు నోఫుడ్ బోర్డు పెట్టేశాయి. ఉద్యోగులు, విద్యార్థులకు ఇబ్బందులు తప్పవంటున్నారు. ఇక్కడే ఉండేవారు బయట తిందామంటే హోటళ్లూ బంద్ ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం తమ కోణంలో ఆలోచించి ఫుడ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
News January 12, 2026
HYD: హాస్టళ్లలో నో ఫుడ్!

సంక్రాంతి సెలవులు వస్తే HYDలో ఉండే బ్యాచ్లర్లకు తిండి కష్టాలు వస్తాయని వాపోతున్నారు. DSNR, అమీర్పేట్, హైటెక్స్, KPHB తదితర ఏరియాల్లో ప్రైవేట్ హాస్టళ్ల యాజమాన్యాలు వారం రోజులు నోఫుడ్ బోర్డు పెట్టేశాయి. ఉద్యోగులు, విద్యార్థులకు ఇబ్బందులు తప్పవంటున్నారు. ఇక్కడే ఉండేవారు బయట తిందామంటే హోటళ్లూ బంద్ ఉన్నాయని ఆవేద వ్యక్తం చేశారు. యాజమాన్యం తమ కోణంలో ఆలోచించి ఫుడ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
News January 12, 2026
మృత్యువును ఆపిన ‘డెలివరీ’ బాయ్.. HYDలో సెల్యూట్

నిత్యం ట్రాఫిక్తో కుస్తీ పట్టే ఓ డెలివరీ బాయ్ మానవత్వంలో అందరికంటే ముందున్నాడు. ఆత్మహత్యకు సిద్ధపడిన ఓ మహిళ ఆర్డర్ చేసిన విషాన్ని డెలివరీ చేయకుండా ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చి ప్రాణాలు కాపాడాడు. నగరంలోని మీడియా జంక్షన్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ ఉదంతం చర్చకు రాగా అక్కడి వారంతా లేచి నిలబడి ఆ యువకుడికి సెల్యూట్ చేశారు. ఈ ‘నిజమైన హీరో’ ఇప్పుడు హైదరాబాదీల ప్రశంసలు అందుకుంటున్నాడు.


