News April 11, 2025
SKLM: అణగారిన వర్గాల ఆశా జ్యోతి మహాత్మా జ్యోతీరావు ఫూలే

అణగారిన వర్గాల అభ్యున్నతి కి కృషి చేసి, పనిచేసిన మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి కొనియాడారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జ్యోతిరావు పూలే చిత్రపటానికి ఎస్పీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. సామాజిక సంఘ సంస్కరణ ఉద్యమంలో ఫూలే ఒక ముఖ్యమైన వ్యక్తిగా నిలిచారన్నారు. సంస్కరణోద్యమంగా పేరుగాంచి కుల మత వర్ణ విబేధాలకు స్వస్తి పలికారన్నారు.
Similar News
News March 16, 2026
SSC ఎగ్జామ్స్ శ్రీకాకుళం జిల్లా రాష్ట్ర పరిశీలకులుగా భానుమూర్తి

శ్రీకాకుళం జిల్లాలో నేటి నుంచి జరగనున్న పదో తరగతి పరీక్షలకు జిల్లా రాష్ట్ర పరిశీలకులుగా భానుమూర్తి రాజు నియమితులయ్యారు. ప్రస్తుతం విజయవాడలోని ఓ కళాశాలలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తుండగా..ఆదివారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో బాధ్యతలను చేపట్టారు. పకడ్బందీగా పదో తరగతి పరీక్షలు నిర్వహణకు తగిన చర్యలు తీసుకుంటానని ఆయన అన్నారు.
News March 16, 2026
శ్రీకాకుళం జడ్పీలో పీజీఆర్ఎస్ కార్యక్రమం

శ్రీకాకుళంలో జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై నేరుగా లేదా Meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా అర్జీలు సమర్పించవచ్చన్నారు. అర్జీల స్థితిగతులను 1100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చని ఆయన సూచించారు.