News April 11, 2025
HYD: BRS రజతోత్సవ సభకు రూ.25 లక్షల విరాళం

ఈనెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించే BRS రజతోత్సవ సభకు పార్టీ రంగారెడ్డి జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు పట్నం అవినాశ్ రెడ్డి తన వంతు సహకారాన్ని అందించారు. ఏర్పాట్లకు రూ.25 లక్షల చెక్కును ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ KTRకు అందించారు. ఈ సందర్భంగా కేటీఆర్ అవినాశ్ రెడ్డిని అభినందించారు.
Similar News
News March 26, 2026
సత్యవేడులో దారుణం.. తల్లి చేతిలో బిడ్డ హత్య.?

సత్యవేడు(M) NRఅగ్రహారంలో విషాదం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. హేమావతికి కొద్ది రోజుల కిందట ఆడబిడ్డ పుట్టింది. అయితే ఇవాళ ఆమె కూతురుని చంపేసింది. బిడ్డ తరుచూ పాల కోసం ఏడుస్తూ ఉండడంతో నచ్చక ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిందితురాలు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమెను పోలీసులు విచారిస్తున్నారు.
News March 26, 2026
CSK బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు.. ఓపెనర్స్ ఎవరంటే?

ఈ ఏడాది IPLలో బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేయనున్నట్లు CSK కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వెల్లడించారు. సంజూ శాంసన్, తాను ఇన్నింగ్స్ ప్రారంభిస్తామని కెప్టెన్స్ డే ఈవెంట్‌లో తెలిపారు. ఈ సీజన్‌లో ఆయుష్ మాత్రే ఓపెనర్‌గా దిగడం లేదని చెప్పారు. దీంతో అతను మూడో స్థానంలో, బ్రెవిస్ ఫోర్త్ ప్లేస్‌లో ఆడే అవకాశం ఉంది. కాగా గత సీజన్ ఆరంభంలో చెన్నై ఓపెనింగ్ వైఫల్యంతో ఇబ్బంది పడిన విషయం తెలిసిందే.
News March 26, 2026
GWMC బడ్జెట్‌లో ఏ విభాగానికి ఎంతంటే?

GWMC బడ్జెట్‌లో ఇంజినీరింగ్ విభాగానికి గత బడ్జెట్లో రూ.32.85 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.36.15 కోట్లు కేటాయించారు. సాధారణ పరిపాలనకు గత బడ్జెట్లో రూ.22.95 కోట్లు ఉండగా, ఈ సారి రూ.30.41 కోట్లు, పట్టణ ప్రణాళిక విభాగానికి గత బడ్జెట్లో రూ.95 లక్షలు ఉండగా, ఈ సారి రూ.1.40 కోట్లు, విలీన గ్రామాలకు రూ.22.88 కోట్ల నుంచి రూ.25.43 కోట్లు, ప్రజా సౌకర్యాలకు రూ.3.65 కోట్ల నుంచి రూ.2.70 కోట్లకు తగ్గించారు.


