News April 11, 2025

నారాయణపేట: Way2Newsలో వార్త.. ఆ ఊరికి బ్రిడ్జి..!

image

నారాయణపేట జిల్లా మరికల్‌లో నాయీ బ్రాహ్మణ శ్మశాన వాటికకు నిత్యం వాగులో నుంచి నడుచుకుంటూ అంత్యక్రియలకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఈఘటనపై బుధవారం Way2Newsలో<<16039649>> ‘అంతిమయాత్రకు తప్పని తిప్పలు’<<>> అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. స్పందించిన ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి వెంటనే వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాల్సిందిగా ఆదేశించారు. శుక్రవారం సంబంధిత అధికారులు వంతెన నిర్మించేందుకు కొలతలను తీసుకెళ్లారు.

Similar News

News March 12, 2026

అనంతపురం జిల్లాలో గ్యాస్ కొరత లేదు: జేసీ

image

అనంతపురం జిల్లాలో గ్యాస్ సిలిండర్ల సరఫరా సాధారణంగానే కొనసాగుతోందని, వినియోగదారులు ఆందోళన చెందవద్దని జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ తెలిపారు. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా కొరత ఏర్పడుతుందనే ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. సింగిల్ సిలిండర్ వారు 21 రోజులు, డబుల్ సిలిండర్ వారు 30 రోజుల వ్యవధిలోనే బుకింగ్ చేసుకోవాలని సూచించారు. ఆసుపత్రులు, హాస్టళ్లకు సరఫరా నిరంతరాయంగా జరుగుతుందని వెల్లడించారు.

News March 12, 2026

రేపు కడపకు రానున్న గవర్నర్

image

రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఈనెల 13న కడపకు రానున్నారు. YVU జరగనున్న స్నాతకోత్సవానికి ఆయన ఛాన్స్‌లర్ హోదాలో ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు. విజయవాడ నుంచి హెలికాప్టర్లో కడప విమానాశ్రయం చేరుకొంటారు. అక్కడి నుంచి కార్యక్రమం జరిగే వేదిక చేరుకొంటారు. అనంతరం తిరిగి ఆయన విజయవాడకు ప్రత్యేక హెలికాప్టర్‌లో వెళ్లనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

News March 12, 2026

అనకాపల్లి: మహిళల సమస్యలపై రేపు ‘మహిళా జన్ సున్వాయ్’

image

మహిళల సమస్యలపై ఈనెల 13న విశాఖ జిల్లా పరిషత్ కార్యాలయంలో ‘మహిళా జన్ సున్వాయ్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని అనకాపల్లి జిల్లా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ అధికారిణి సూర్యలక్ష్మి బుధవారం తెలిపారు. రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ ఆర్.శైలజ పాల్గొని మహిళల సమస్యలపై ఫిర్యాదులు స్వీకరిస్తారని పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లాకు చెందిన మహిళలు అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.