News April 11, 2025
మన్సానిపల్లి: చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

అందోల్ మండలం మన్సానిపల్లికి చెందిన చాకలి కిష్టయ్య గురువారం గ్రామంలో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న జోగిపేట ఎస్సై పాండు కిష్టయ్య మృతదేహం లభ్యం కావడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Similar News
News March 27, 2026
చరిత్రలో ఈరోజు (మార్చి 27)

1845: ఎక్స్ కిరణాల ఆవిష్కర్త, నోబెల్ బహుమతి గ్రహీత విల్హేల్మ్ కన్రాడ్ రాంట్జెన్ జననం
1985: సినీ నటుడు రామ్ చరణ్ జననం
1937: నటి, నృత్య కళాకారిణి రాగిణి జననం
1968: అంతరిక్షంలోకి వెళ్లిన మొట్టమొదటి మనిషి యూరీ గగారిన్ మరణం
☛ ప్రపంచ రంగస్థల దినోత్సవం
News March 27, 2026
గుంటూరులో ఉచిత వృత్తి విద్యా శిక్షణ

గుంటూరు యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వృత్తి విద్యా కోర్సులను అందిస్తున్నారు. శిక్షణ తీసుకునే వారికి భోజనం, హాస్టల్ వసతి పూర్తిగా ఉచితం. కోర్సు పూర్తయిన వెంటనే అభ్యర్థులకు ఉచితంగా టూల్ కిట్ కూడా అందజేస్తారు. ఆసక్తి గల వారు సంబంధిత ఆన్‌లైన్ లింక్ ద్వారా తమకు నచ్చిన కోర్సుకు రిజిస్టర్ చేసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు.
News March 27, 2026
ఇరాన్‌పై దాడులు మరో 10 రోజులు వాయిదా

ఇరాన్ ఎనర్జీ ప్లాంట్లపై దాడులను మరో 10 రోజులు ఆపుతున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ ప్రభుత్వ కోరిక మేరకు ఏప్రిల్ 6 రాత్రి 8 గంటల వరకు ఈ గడువు పొడిగించినట్లు తెలిపారు. ఇరాన్‌తో జరుగుతున్న చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని, ఫేక్ న్యూస్ నమ్మొద్దని పేర్కొన్నారు. ఇరానీయన్లు చర్చల్లో మేటి అని ట్రంప్ కొనియాడారు. యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నేపథ్యంలో ట్రంప్ తాజా నిర్ణయం రిలీఫ్‌నిచ్చింది.


