News April 11, 2025
విశాఖ: రేపే ఇంటర్ ఫలితాలు

ఇంటర్ ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి. విశాఖ జిల్లాలో ఫస్టియర్ 42,257 మంది, సెకండియర్ 40,744 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. మొత్తం 83,001 మంది ఇంటర్ విద్యార్థులు పరీక్షలు రాశారు. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ☞ వే2న్యూస్ యాప్‌లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
Similar News
News March 8, 2026
విశాఖలో చేయి తడిపితేనే.. కొళాయి కనెక్షన్

విశాఖలోని నీటి కొళాయి కనెక్షన్ కోసం జీవీఎంసీకి దరఖాస్తు చేసి, ఫీజులు చెల్లించినా మంజూరులో జాప్యం జరుగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రూప్ హౌస్‌లు, అపార్ట్‌మెంట్‌ల బల్క్ వాటర్ కనెక్షన్ల విషయంలో కింది స్థాయి సిబ్బంది లంచాలు డిమాండ్ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. డబ్బులు ఇవ్వకుంటే ఫైళ్లు పెండింగ్‌లో ఉంచుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. మీ పరిధిలో ఇలాంటి సమస్య ఉంటే కామెంట్ చేయండి.
News March 7, 2026
విశాఖ: పన్నులు చెల్లించకుంటే జప్తే

ఆర్థిక సంవత్సరం ముగుస్తుండగా జీవీఎంసీ అధికారులు పన్నుల వసూళ్లపై దృష్టి సారించారు. రూ.650 కోట్ల లక్ష్యాన్ని చేరుకునేందుకు మొండి బకాయిదారులపై చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే 1,36,149 మంది బకాయిదారులను గుర్తించి, 1,10,136 మందికి జప్తు నోటీసులు జారీ చేశారు. నీటి పన్ను చెల్లించని 62,290 మందికి కనెక్షన్లు తొలగిస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం రూ.458.9 కోట్లు వసూలు కాగా, రూ.188.20 కోట్లు రావాల్సి ఉంది.