News March 27, 2024
రేపు విశాఖకు చెన్నై సూపర్ కింగ్స్ టీం..!

ఈనెల 31న విశాఖలో జరిగే చెన్నై సూపర్‌కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ టికెట్ల అమ్మకాలు ఈరోజు ఉ.10 గంటల నుంచి పేటీఎం ఇన్‌సైడర్ వెబ్‌సైట్ ద్వారా ప్రారంభం కానున్నాయి. టికెట్ల ధరలు రూ.1,000, రూ.1,500, రూ.2వేలు, రూ.3వేలు, రూ.3,500, రూ.5వేలు, రూ.7,500గా నిర్ణయించారు. ఆన్‌లైన్‌లో మాత్రమే టికెట్ల అమ్మకాలు జరుగుతాయి. రేపు CSK జట్టు, ఎల్లుండి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు విశాఖ రానున్నట్లు సమాచారం.
Similar News
News March 7, 2026
సివిల్స్ ర్యాంకర్ రామును అభినందించిన అచ్చెన్న

జి. సిగడాం మండలం నడిమివలస గ్రామానికి చెందిన సౌరోతు రాము సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 463వ ర్యాంకు సాధించడం పట్ల వ్యవసాయ శాఖమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అభినందించారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన రాము కష్టపడి చదివి ఈరోజు సివిల్స్‌లో మంచి ర్యాంక్ సాధించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కృషి ఉంటే ఎలాంటి పరిస్థితులులోనైనా ఉన్నత స్థాయిలో రాణించవచ్చన్నారు.
News March 7, 2026
శ్రీకాకుళం: కేజీబీవీల్లో ప్రవేశాలకు వేళాయె!

పేద విద్యార్థులకు ప్రమాణాలతో విద్య అందిస్తున్న కేజీబీవీలో 6 వ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి ఏడాది ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల అయింది. శ్రీకాకుళం జిల్లాలో 25 కేజీబీవీలు ఉన్నాయి. ఈనెల 12 నుంచి ఏప్రిల్ ఒకటి వరకు దరఖాస్తుకు అవకాశం ఇచ్చారు. డ్రాప్ అవుట్, అనాధ, సింగిల్ పేరెంట్ బాలికలకు ప్రాధాన్యత ఇస్తారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
News March 7, 2026
శ్రీకాకుళం: వ్యవసాయ కూలీ కొడుకు సివిల్స్‌లో సత్తా

జి. సిగడాం మండలం నడిమివలస గ్రామానికి చెందిన సౌరోతు రాము సివిల్స్ పరీక్షల్లో ప్రతిభ చాటుతూ ఆల్ ఇండియా స్థాయిలో 463వ ర్యాంకు సాధించారు. సాధారణ రైతు కుటుంబానికి చెందిన రామును తల్లి లక్ష్మి వ్యవసాయ పనులు చేస్తూ చదివించారు. జి.సిగడాం ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదివిన ఆయన, వరంగల్ నిట్‌లో బీటెక్ పూర్తి చేశారు. అనంతరం 11 నెలలు ఉద్యోగం చేసి, సివిల్స్ లక్ష్యంతో ఉద్యోగాన్ని వదిలి సిద్ధమయ్యారు.


