News April 11, 2025
విడిపోయినా కో-పేరెంటింగ్ చేస్తున్న సమంత, చైతూ!

వివాహ బంధానికి విడాకులతో వీడ్కోలు పలికిన సమంత, చైతూ తమ పెంపుడు కుక్కకు మాత్రం కో-పేరెంట్స్‌గా కొనసాగుతున్నారని ఓ రెడిట్ యూజర్ పోస్ట్ చేశాడు. ‘విడాకులకు ముందే హ్యాష్ అనే శునకాన్ని సామ్ దత్తత తీసుకున్నారు. డివోర్స్ అనంతరం చైతూ వద్ద కూడా అది కనిపించింది. వారు దానికి కో-పేరెంటింగ్ చేస్తున్నట్లున్నారు’ అని రాసుకొచ్చాడు. మనుషులు విడిపోయినా మూగ జీవాలను దూరం చేసుకోవద్దని నెటిజన్లు అంటున్నారు.
Similar News
News April 19, 2025
డ్రగ్స్ కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్

డ్రగ్స్ కేసులో మలయాళ నటుడు టామ్ చాకో అరెస్ట్ అయ్యారు. డ్రగ్స్ మత్తులో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఓ నటి ఫిర్యాదు చేయడంతో కేరళ పోలీసులు ఆయన ఉన్న హోటల్‌పై రైడ్ చేశారు. వారిని చూసి చాకో పరారయ్యారు. అప్పటి నుంచి ఆయన కోసం గాలింపు చేపట్టి, తాజాగా కొచ్చిలో అదుపులోకి తీసుకున్నారు. చాకో తెలుగులో దసరా, దేవర, రాబిన్‌హుడ్ తదితర చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు.
News April 19, 2025
ఈ ఏడాది చివర్లో ఇండియాకు వస్తా: మస్క్

ప్రధాని మోదీతో మాట్లాడటం గౌరవంగా ఉందని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. ఈ ఏడాది చివర్లో భారత్‌లో పర్యటిస్తానని ఆయన రాసుకొచ్చారు. నిన్న ప్రధాని నరేంద్ర మోదీ చేసిన <<16137981>>ట్వీట్‌కు<<>> ఆయన రిప్లై ఇచ్చారు. కాగా, మస్క్‌కు చెందిన టెస్లా, స్టార్‌లింక్ కంపెనీలు త్వరలో ఇండియాలో తమ కార్యకలాపాలను ప్రారంభించే అవకాశం ఉంది.
News April 19, 2025
మరో గంటలో వర్షం

TG: పలు జిల్లాల్లో ఇవాళ కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. మహా నగరంలో నిన్నటి తరహాలోనే సాయంత్రం వాన పడొచ్చని అంచనా వేసింది. అలాగే మెదక్, మేడ్చల్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో మరో గంటలో వర్షం కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఉదయం నుంచి ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఇది ఉపశమనం కలిగించే వార్తే అయినా అకాల వర్షాలతో జిల్లాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి.