News April 11, 2025

నెల్లూరు: 50 మందికి 11.40 కోట్ల రుణాలు

image

నెల్లూరు కలెక్టరేట్‌లోని తిక్కన భవన్‌లో ఫూలే జయంతి శుక్రవారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, కలెక్టర్ ఆనంద్, జేసీ కార్తీక్ పూలదండలు వేసి నివాళులర్పించారు. 50 మంది బీసీలకు మంజూరైన రూ.11.4కోట్ల రుణాల చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

Similar News

News April 18, 2026

నెల్లూరు: విషాదం.. ఈతకు వెళ్లి విద్యార్థి మృతి

image

లింగసముద్రం (M)లో విషాద ఘటన చోటుచేసుకుంది. జంపాలవారిపాలానికి చెందిన ఏడో తరగతి విద్యార్థి గడ్డం వినయ్ బాబు స్నేహితులతో కలిసి జంగారెడ్డిపాలెం సమీపంలోని చెక్‌డ్యాం వద్ద ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. SI రాంబాబు దర్యాప్తు చేపట్టారు. శనివారం మృతదేహాన్ని చెక్‌డ్యాం నుంచి వెలికి తీసి పోస్టుమార్టం కోసం కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించారు.

News April 18, 2026

నెల్లూరు: బాలికపై రేప్.. పదేళ్లు జైలు శిక్ష

image

నెల్లూరు రూరల్ కొత్తూరుకు చెందిన చిన్న సుబ్బయ్య(45) తన పిల్లలకు పెళ్లిళ్లు చేసి, తన అక్క ఇంట్లో ఉంటున్నాడు. అక్క కుమార్తె(16)ని 2021లో బంధువుల ఇంటికి తీసుకెళుతున్నట్లు నమ్మించి వివాహం చేసుకొని అత్యాచారం చేశారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. విచారించిన కోర్టు నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.

News April 18, 2026

ఏపీ జట్టు కెప్టెన్‌గా ముత్తుకూరు యువకుడు

image

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ వేదికగా ఏప్రిల్ 30 నుంచి మే 3 వరకు జరిగే జాతీయ స్థాయి టీ-10 క్రికెట్ పోటీలకు ఆంధ్రప్రదేశ్ జట్టు కెప్టెన్‌గా నెల్లూరు జిల్లా ముత్తుకూరు యువకుడు బాపనపాటి ప్రకాశ్ ఎంపికయ్యాడు. కరీముల్లా, సునీల్, వెంకటేశ్, నాగేంద్ర, అఖిల్ తదితరులు జట్టు సభ్యులుగా అసోసియేషన్ ప్రకటించింది. స్థానిక క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.