News April 11, 2025

ఫూలే సిద్దాంతాలు ఆదర్శప్రాయం: కలెక్టర్ 

image

సమ సమాజ స్థాపనకు అహర్నిశలు కృషి చేసిన సంఘ సంస్కర్త సామాజిక తత్వవేత్త మహాత్మా జ్వోతిరావ్ ఫూలే అని నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్‌ లక్ష్మీశ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని ఫూలే జయంతి వేడుకలను పురస్కరించుకొని కలెక్టర్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. సామాజిక అసమానతలను రూపుమాపేందుకు సామాజిక ఉద్యమానికి అలుపెరగని పోరాటం చేశారన్నారు. 

Similar News

News March 14, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News March 14, 2026

మంగళగిరిలో ఆహార భద్రత శాఖ పనితీరుపై మంత్రి సమీక్ష

image

కుంచనపల్లిలోని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కార్యాలయంలో ఆహార భద్రత శాఖ పనితీరుపై మంత్రి సత్యకుమార్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రం ఆహార భద్రత సూచీలో దేశంలో తొలి 10 స్థానాల్లో నిలవాలని లక్ష్యంగా పెట్టాలని అధికారులకు సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరిస్తూ ముఖ ఆధారిత హాజరు తప్పనిసరి చేయాలన్నారు. బాగా పనిచేసేవారిని ప్రోత్సహించి, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించేవారిపై చర్యలు ఉంటాయన్నారు.

News March 14, 2026

ఇరాన్ అగ్రనేతల సమాచారమిస్తే ₹92Cr రివార్డు

image

ఇరాన్ టాప్ లీడర్ల గురించి సమాచారం ఇచ్చిన వారికి $10m (₹92.5కోట్ల) వరకూ రివార్డు ఇస్తామని యూఎస్ ప్రకటించింది. రక్షణ కూడా కల్పిస్తామని హామీ ఇచ్చింది. US ప్రకటించిన లిస్టులో సుప్రీం లీడర్ మొజ్తబా సహా మరో 9 మంది పేర్లు ఉన్నాయి. మరోవైపు US మిలిటరీకి సంబంధించిన సమాచారమిస్తే 150 మిలియన్ ఇరాకీ దినార్లు (₹కోటి) రివార్డుగా ఇస్తామని ఇరాన్ మద్దతు సంస్థ ‘ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఇన్ ఇరాక్’ ప్రకటించింది.