News April 11, 2025
ధాన్యం కొనుగోళ్లపై మంత్రి కీలక ఆదేశాలు

TG: అకాల వర్షాలతో రాష్ట్రంలో పలు చోట్ల ధాన్యం తడిసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. చాలా ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయని చెప్పారు. తడిసిన ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకుంటామని, తరుగు తీస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో సన్నబియ్యం రేషన్ మంచి పథకమని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు.
Similar News
News March 23, 2026
నక్కపల్లి: స్టీల్ ప్లాంట్ ప్రతినిధుల నుంచి వివరాలు తెలుసుకున్న చంద్రబాబు

ముఖ్యమంత్రి చంద్రబాబు హెలికాప్టర్‌లో దిగి నక్కపల్లి మండలం చందనాడ వద్ద గల సభా ప్రాంగణానికి చేరుకున్నారు. శంకుస్థాపనకు ముందు ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ప్రతినిధులతో ప్లాంట్ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్లాంట్ ఏర్పాటు, ఉత్పత్తి, ఉద్యోగ అవకాశాలపై స్టీల్ ప్లాంట్ ప్రతినిధులు చంద్రబాబుకు వివరించారు. ఇది దేశంలోనే అతిపెద్ద ప్లాంట్‌గా ప్రతినిధులు పేర్కొన్నారు.
News March 23, 2026
TN పోల్స్.. బీజేపీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందంటే?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ, AIADMK మధ్య సీట్ల ఒప్పందం కుదిరింది. ఒప్పందం ప్రకారం బీజేపీకి 27 సీట్లు ఇచ్చేందుకు AIADMK అంగీకరించింది. PMK 18, AMMK 11 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. గత ఎన్నికల కంటే బీజేపీ 7 సీట్లు ఎక్కువ దక్కించుకుంది. ఆ రాష్ట్రంలో మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.
News March 23, 2026
ఇళ్ల కోసం 10 లక్షల దరఖాస్తులు: పార్థసారథి

AP: రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల కోసం 10 లక్షల దరఖాస్తులు వచ్చాయని మంత్రి పార్థసారథి తెలిపారు. అందులో 6.5 లక్షల మందికి అర్హత ఉందని గుర్తించామని చెప్పారు. ఇంటి నిర్మాణ వ్యయం పట్టణాల్లో రూ.2.5 లక్షలు, గ్రామాల్లో రూ.2.39 లక్షలుగా నిర్ణయించినట్లు వెల్లడించారు. మరోవైపు అకాల వర్షాలకు దాదాపు 15 వేల మంది రైతులు నష్టపోయారని పేర్కొన్నారు. ఈ నెల 31 లోపు పంట నష్టం వివరాలను అందించాలని ఆదేశించినట్లు వివరించారు.


